రెండు నెలల్లో టీచర్లను సర్దుబాటు చేస్తాం
ABN , First Publish Date - 2021-11-27T04:37:58+05:30 IST
చిలేకాంపల్లె జడ్పీ హైస్కూల్ కు రెండు నెలల్లో ఉపాధ్యా యులను సర్దుబాటు చేస్తామ ని ఉప విద్యాశాఖాధికారి రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు.

చక్రాయపేట, నవంబరు 26: చిలేకాంపల్లె జడ్పీ హైస్కూల్ కు రెండు నెలల్లో ఉపాధ్యా యులను సర్దుబాటు చేస్తామ ని ఉప విద్యాశాఖాధికారి రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం చిలేకాంపల్లె ఎంపీ పీ పాఠశాలలోని 3,4,5 తరగ తులను హైస్కూల్లో విలీనం చేయడంతో పాఠశాలను సందర్శించిన ఆయన మాట్లాడుతూ
ఉన్నత పాఠశాల ల్లోని ఉపాధ్యాయులే వారికి పాఠ్యాంశాలు బోధించాలని సూచించారు. అనంత రం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అనంతరం సురభి జడ్పీ హైస్కూల్, ఎమ్మార్సీ కార్యాలయాన్ని సందర్శించారు. ఎంఈఓ రవీంద్రనాయక్, హెచ్ఎంలు రామకృష్ణమూర్తి, సంజీవ్‌కుమార్, ఉపాధ్యాయులు, సీఆర్పీలు పాల్గొన్నారు.