డ్రిప్పుతో నీటి తడులు అందించాలి

ABN , First Publish Date - 2021-02-05T05:32:34+05:30 IST

భూమి లో నీటి శాతం ఎక్కువగా ఉన్నందున చీనీ తోటలకు డ్రిప్పుల ద్వారా మాత్రమే నీటిని అందించాలని శాస్త్రవేత్తలు సూచించారు. తేమ శాతం పెరిగితే తెగుళ్లు వచ్చే ప్రమాదముం దన్నారు.

డ్రిప్పుతో నీటి తడులు అందించాలి
బలపనూరులో చీనీ తోటలను పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు, ఉద్యాన శాఖ అధికారులు

తేమ శాతం పెరగడంతో సోకిన తెగుళ్లు

చీనీ తోటల పరిశీలనలో శాస్త్రవేత్తలు

సింహాద్రిపురం/లింగాల, ఫిబ్రవరి 4: భూమి లో నీటి శాతం ఎక్కువగా ఉన్నందున చీనీ తోటలకు డ్రిప్పుల ద్వారా మాత్రమే నీటిని అందించాలని శాస్త్రవేత్తలు సూచించారు. తేమ శాతం పెరిగితే తెగుళ్లు వచ్చే ప్రమాదముం దన్నారు. సింహాద్రిపురం, లింగాల మండలా ల్లో చీనీ తోటలను ఉద్యాన శాఖాధికారులు గురువారం పరిశీలించారు. సింహాద్రిపురం మండలం బి.చెర్లోపల్లి, హిమకుంట్ల, బలప నూరు, సింహాద్రిపురం మండలం పెద్దకుడా ల, బోనాల, అంకేవానిపల్లెల్లో దెబ్బతిన్న చీనీ తోటలపై రైతుల ఫిర్యాదులు, వార్తా పత్రిక ల్లో వచ్చిన కథనాల ఆధారంగా తోటలను పరిశీలించేందుకు కమిటీని ఏర్పాటు చేసిన ట్లు ఉద్యాన శాఖ ఉప సంచాలకులు వజ్రశ్రీ తెలిపారు.

ఈ కమిటీలో సభ్యులుగా డీడీహెచ సహా ఏడీ హెచలు వెంకటేశ్వర్‌ రెడ్డి, రవీంద్రనాథరెడ్డి, చీనీ, నిమ్మ పరిశోధ నాకేంద్రం తిరుపతి ప్రధాన శాస్త్రవేత్త రమ ణ, ఉద్యాన శాఖ అనంతరాజుపేట ప్రధాన శాస్త్రవేత్త నాగరాజు, హెచఓలు సుకుమార్‌ రెడ్డి, రాఘవేందర్‌ రెడ్డి వేరుకుళ్ళు తెగులు, ఇగుర్లు, పూతను  పరిశీలించారు. వేరుకు ళ్ళు తెగులు నివారణకు  కాఫర్‌ ఆక్సీ క్లోరై డ్‌, మెటలాక్చిల్‌, మాంకోజబ్‌  మిశ్రమాల వాడకంపై సూచించారు. కాండంపై వచ్చిన బంక తెగులు నివారణకు బంకను తొల గించి, బోర్డోపేస్టు (సున్నం, మైలతుత్తు మి శ్రమం) పూయాలన్నారు.

Updated Date - 2021-02-05T05:32:34+05:30 IST