నీటిని పొదుపుగా వాడుకోవాలి

ABN , First Publish Date - 2021-03-23T04:30:22+05:30 IST

నీరే జీవాధారమని, నీటిని పొదుపుగా వాడుకోవాలని మున్సిపల్‌ చైర్మన్‌ మాచనూరు చంద్ర అన్నారు.

నీటిని పొదుపుగా వాడుకోవాలి

మైదుకూరు, మార్చి22 : నీరే జీవాధారమని, నీటిని పొదుపుగా వాడుకోవాలని మున్సిపల్‌ చైర్మన్‌ మాచనూరు చంద్ర అన్నారు. వరల్డ్‌ వాటర్‌ డే సందర్భంగా సోమవారం మున్సిపల్‌ కమిషనర్‌ రామక్రిష్ణ ఆధ్వర్యంలో ప్రధాన రహదారులపై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్ర మాట్లాడుతూ ప్రతి ఒక్క రూ నీటిని పొదుపుగా వాడాలని, నీటి సంరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని కోరారు. ఏఈ మధుసూదన్‌, సిబ్బంది పవన్‌, వైసీపీ నాయకులు ఎమ్మార్‌ఎఫ్‌ నాయకుడు సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-23T04:30:22+05:30 IST