పీబీసీ కాల్వకు నీరు విడుదల

ABN , First Publish Date - 2021-02-07T04:34:42+05:30 IST

పార్నపల్లె చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వా యర్‌ (సీబీఆర్‌) నుంచి పులివెందుల బ్రాంచ కెనాల్‌ (పీబీసీ)కి నీటిపారుదల శాఖ అధికారులు నీటిని విడుదల చేశారు.

పీబీసీ కాల్వకు నీరు విడుదల

లింగాల, ఫిబ్రవరి 6: పార్నపల్లె చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వా యర్‌ (సీబీఆర్‌) నుంచి పులివెందుల బ్రాంచ కెనాల్‌ (పీబీసీ)కి నీటిపారుదల శాఖ అధికారులు నీటిని విడుదల చేశారు. శని వారం ఉదయం 10:30గంటలకు పీబీసీ ఈఈ రాజశేఖర్‌, లిం గాల కుడికాల్వ ఈఈ చిన్నరామునాయక్‌,  డీఈ వెంకటప్ప సీబీఆర్‌ కుడికాల్వ గేట్ల వద్ద పూజలు నిర్వహించి గేట్లను ఎత్తి నీటిని వదిలారు.

పీబీసీ ఆయకట్టు పరిధి తొండూరు మండల రైతుల విజ్ఞప్తిపై వంద క్యూసెక్కుల నీరు విడుదల చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు నీటిని వదిలినట్లు అధికా రులు తెలిపారు. ఈ నీరు లింగాల కుడికాల్వ లింక్‌ కెనాల్‌ ద్వా రా పీబీసీ కాల్వకు నీరు చేరుతుంది. అవసరాన్ని బట్టి నీటిని మరింత పెంచుతామని వారు తెలిపారు. ప్రస్తుతం సీబీఆర్‌లో 10టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.  ఏఈలు వంశీ, శ్యామ్‌, జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌  నాగేశ్వర రావు, ప్రభాకర్‌రెడ్డి, లష్కర్లు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-07T04:34:42+05:30 IST