చెయ్యేరు జలకళ
ABN , First Publish Date - 2021-05-22T05:02:49+05:30 IST
కొద్దిపాటి వర్షానికే చెయ్యేరులో జలకళను సంతరించుకుంది. గురువారం అర్ధరాత్రి కురిసిన కుండపోత వర్షానికి చెయ్యేరు జలకళ సంతరించుకుంది.

పెనగలూరు, మే21 : కొద్దిపాటి వర్షానికే చెయ్యేరులో జలకళను సంతరించుకుంది. గురువారం అర్ధరాత్రి కురిసిన కుండపోత వర్షానికి చెయ్యేరు జలకళ సంతరించుకుంది. ఉన్నట్లుండి పలు ప్రాంతాల్లో కుండ పోత వర్షం కురవడంతో చెయ్యేరు తెల్లవారేటప్పటికి ఒక మోస్తారు నీటి ప్రవాహంతో కనిపించింది. ఇదిఇలా ఉండగా గత ఏడాది డిసెంబరు వరకు మంచి వర్షాలు కురవడంతో ఇటీవల కాలం వరకు చెయ్యేటిలో నీటి ప్రవాహం కొనసాగుతూ వచ్చింది. అయితే వారం రోజుల క్రిందటనే ఆగిపోయింది. కాగా గురువారం అర్ధరాత్రి కురిసిన వర్షంతో మరలా ప్రవాహం కనిపించింది. ఇదిఇలా ఉండగా ఇప్పటికింకా గత ఏడాది వర్షపు ప్రభావం వలన కుంటలు, చెరువులలో ఓ మోస్తారు నీరు నిలిచి ఉంది. పంట కాలువల్లో కూడా నీరు నిలిచి ఉండటం విశేషం.