హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2021-08-11T05:09:33+05:30 IST

ప్రమాదకరంగా ఉన్న చెరువులు, వంకలు, వాగుల వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని నియోజకవర్గ స్పెషల్‌ ఆఫీసర్‌ శాంతమ్మ తెలిపారు.

హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి
మాట్లాడుతున్న ప్రత్యేక అధికారి శాంతమ్మ

నియోజకవర్గ స్పెషల్‌ ఆఫీసర్‌ శాంతమ్మ

కమలాపురం(రూరల్‌), ఆగస్టు 10: ప్రమాదకరంగా ఉన్న చెరువులు, వంకలు, వాగుల వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని నియోజకవర్గ స్పెషల్‌ ఆఫీసర్‌ శాంతమ్మ తెలిపారు. మంగళవారం కలెక్టర్‌ ఆదేశాల మేరకు స్థానిక ఎంపీడీవో కార్యాలయ సభాభవనంలో ఎంపీడీవో శివరామిరెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో వివిధ చోట్ల నీటిలో గల్లంతై ఆరు మంది మృతి చెందినట్లు సోమవారం పలు పత్రికల్లో వచ్చిందని, ఈ సంఘటనలు బాధాకరమన్నారు. మన ప్రాంతంలో ఇటువంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పాపాఘ్ని నది, పెన్నానది కలిసే చోట ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నందున ఎవరినీ దిగనివ్వకుండా ఒకటవ సచివాలయ ఉద్యోగులు రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. తహసీల్దారు విజయకుమార్‌ మాట్లాడుతూ చాలా మంది మాస్కులు లేకుండా తిరుగుతున్నారని, పంచాయతీ కార్యదర్శులు తనిఖీ చేసి వంద రూపాయలు జరిమానా విధించి అవగాహన కల్పించాలన్నారు. అనంతరం ఎస్‌ఐ తులసీనాగప్రసాద్‌ మాట్లాడారు. కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్‌ రాజశేఖర్‌, ఈవోపీఆర్‌డీ శారదమ్మ, వలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.


అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు

అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని నియోజకవర్గ ప్రత్యేక అధికారి శాంతమ్మ అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయ సభాభవనంలో ఎంపీడీవో శివరామిరెడ్డి ఆధ్వర్యంలో మూడవ విడత వైఎ్‌సఆర్‌ నేతన్న నేస్తం పథక ఆవిష్కరణ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరై ఆమె మాట్లాడారు. మండలంలో 79 మందికి రూ.18.96 లక్షలు, నియోజకవర్గంలో 396 మందికి రూ.95.04 లక్షలు జగనన్న నేతన్న నేస్తం సొమ్ము వారి ఖాతాలోకి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జమ చేశారనితెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ మండలి చైర్మన్‌ ప్రసాద్‌రెడ్డి, మార్కెట్‌యార్డు చైర్మన్‌ ఉత్తమారెడ్డి, ఎన్‌సీ పుల్లారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, తదితరులు మాట్లాడారు. 

Updated Date - 2021-08-11T05:09:33+05:30 IST