పంచాయతీ అభివృద్ధికి వార్డు సభ్యులే కీలకం

ABN , First Publish Date - 2021-10-30T04:52:00+05:30 IST

గ్రామ పంచాయతీ అభివృద్ధిలో వార్డు సభ్యులు ఎంతో కీలకమని ఎంపీడీవో రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.

పంచాయతీ అభివృద్ధికి వార్డు సభ్యులే కీలకం
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీడీవో

మైలవరం, అక్టోబరు 29: గ్రామ పంచాయతీ అభివృద్ధిలో వార్డు సభ్యులు ఎంతో కీలకమని ఎంపీడీవో రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిషత్‌ సమావేశ మందిరంలో ఉప సర్పంచ్‌, వార్డు సభ్యులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎంపీడీవో మాట్లాడుతూ దేశాభివృద్ధి చెందాలంటే ముందుగా గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందాలన్నారు. గ్రామ పంచాయతీలో వార్డు సభ్యులందరూ పరిపాలనపై పూర్తి స్ధాయి అవగాహన కల్పించడానికే శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షకులు బషీర్‌, రామకృష్ణ, మహేందర్‌రెడ్డి, శ్రీను, పంచాయతీ కార్యదర్శులు, వార్డు సభ్యులు, ఉప సర్పంచ్‌లు పాల్గొన్నారు.



Updated Date - 2021-10-30T04:52:00+05:30 IST