వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్..

ABN , First Publish Date - 2021-12-28T21:12:08+05:30 IST

కడప జిల్లా: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్ నెలకొంది.

వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్..

కడప జిల్లా: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. వివేకానంద హత్య కేసులో వేరే వారి పేర్లు చెప్పాలని తనపై ఒత్తిడి పెరుగుతోందని, ఎస్పీకి, పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని వివేకా పీఏ కృష్ణా రెడ్డి పులివెందుల కోర్టును ఆశ్రయించారు. కదిరికి చెందిన అడ్వకేట్ లోకేశ్వర్ రెడ్డి ద్వారా సిబిఐ ఏఎస్పీ అధికారి రామ్ సింగ్‌పై పులివెందుల కోర్టులో ఫిర్యాదు చేశారు. సిబిఐకి మద్దతుగా వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డిలు వేరే పేర్లు చెప్పాలని కృష్ణారెడ్డిపై ఒత్తిడి తెస్తున్నారని లాయర్ కోర్టుకు తెలిపారు.Updated Date - 2021-12-28T21:12:08+05:30 IST