ఫ్యాప్టో జిల్లా చైర్మన్‌గా వెంకటసుబ్బారెడ్డి
ABN , First Publish Date - 2021-10-22T04:56:03+05:30 IST
ఫ్యాప్టో జిల్లా చైర్మన్‌గా వెంకటసుబ్బారెడ్డి ఎన్నికయ్యారు. స్థానిక ఎన్జీవో హోంలో గురువారం ఫ్యాప్టో జిల్లా ఎన్నికలు జరిగాయి.
కడప (ఎడ్యుకేషన్), అక్టోబరు 21: ఫ్యాప్టో జిల్లా చైర్మన్‌గా వెంకటసుబ్బారెడ్డి ఎన్నికయ్యారు. స్థానిక ఎన్జీవో హోంలో గురువారం ఫ్యాప్టో జిల్లా ఎన్నికలు జరిగాయి. ఎన్నికల అధికారి కులశేఖర్‌రెడ్డి, అబ్జర్వర్ జి.వి.నారాయణరెడ్డి ఆధ్వర్యంలో నాయకులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా సెక్రటరీ జనరల్‌గా బహుజన టీచర్స్ అసోసియేషన్ నుంచి (బీటీఏ) హరిబాబు, కో-చైర్మన్‌లుగా జబీర్, బాలగంగిరెడ్డి, ఖాదర్‌బాష, అబ్దుల్లాలను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఎస్టీయూ, యూటీఎఫ్, ఏపీటీఎఫ్ 1938, ఏపీటీఎఫ్ 257 బీటీఏ, ఎస్సీ, ఎస్టీ, డీటీ ఎఫ్ సంఘాల సభ్యులు ఇలియాజ్‌బాష, హరికొండయ్య గురవయ్య, దావూద్‌దీన్, రాజశేఖర్ పాల్గొన్నారు.