డిగ్రీ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన వీసీ

ABN , First Publish Date - 2021-03-25T04:23:01+05:30 IST

జిల్లాలోని డిగ్రీ పరీక్షా కేంద్రాలను వీసీ సూర్యకళావతి బుధవారం తనిఖీ చేశారు.

డిగ్రీ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన వీసీ
పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తున్న వీసీ సూర్యకళావతి

కడప (వైవీయూ), మార్చి 24: జిల్లాలోని డిగ్రీ పరీక్షా కేంద్రాలను వీసీ సూర్యకళావతి బుధవారం తనిఖీ చేశారు. గాలివీడులోని ఆర్‌ఆర్‌జీఆర్‌ డిగ్రీ కళాశాల, శ్రీనివాస డిగ్రీ కళాశాల, సుండుపల్లెలోని హరినాథ్‌ డిగ్రీ కళాశాల,  రాయచోటిలోని అర్చన డి గ్రీ కళాశాల పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. జిల్లాలో 62 కేంద్రాల్లో పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నామని వీసీ సూర్యకళావతి తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని వసతులను కల్పించాలని సిబ్బందికి సూచించారు. జిల్లాలో బీఏ, బీకాం, బీఎస్సీ, టీటీఏ డిగ్రీ మూడవ పరీక్షలలో ఇప్పటి వరకు 79 మంది విద్యార్థులను డీబార్‌ చేశారు. సుండుపల్లె డిగ్రీ కళాశాలలో ఆరుగురిని, కమలాపురంలో ఎనిమిది మందిని, రాయచోటిలో ఆరుగురిని, పెండ్లిమర్రిలో నలుగురిని, ప్రొద్దుటూరులో ఇద్దరిని డీబార్‌ చేసినట్లు వైవీయూ పరీక్షల నిర్వహణ అధికారి ప్రొఫెసర్‌ పద్మ తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని, విద్యార్థులు కాపీలు కొట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.

Updated Date - 2021-03-25T04:23:01+05:30 IST