వరాల తల్లీ వరలక్ష్మీ

ABN , First Publish Date - 2021-08-21T05:03:15+05:30 IST

శ్రావణమాసం సకల శుభాలు కలిగించే వ్రతాల మాసంగా పేరు. మహిళ లు వేకువనే శుచిగా తయారై అమ్మవారి సేవలో తరిస్తారు. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు మహిళలు.

వరాల తల్లీ వరలక్ష్మీ
పోరుమామిళ్లలో వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్న మహిళా భక్తులు

వాడవాడలా వరలక్ష్మీ వ్రతం

ఆలయాల్లోనూ పోటెత్తిన భక్తులు

అలంకరణల్లో అమ్మవార్లు

శ్రావణమాసం సకల శుభాలు కలిగించే వ్రతాల మాసంగా పేరు. మహిళ లు వేకువనే శుచిగా తయారై అమ్మవారి సేవలో తరిస్తారు. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు మహిళలు. ముత్తైదువులకు వాయనాలు ఇస్తూ, తాంబుళం, నైవేద్యం పంపిణీ చేస్తారు. ఇంటి వద్ద వసతి లేని వారు సమీప అమ్మవారి ఆలయాల్లో నిర్వహించే వరలక్ష్మీ వ్రతంలో పాల్గొంటుంటారు. దీంతో ముత్తైదువులు బిజిబిజీగా గడిపారు. ఇళ్ల వద్ద ఒక్కో మహిళ ఇంటి చుట్టుపక్కల ఇళ్లల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొని వాయనాలు స్వీకరిస్తారు. వివరాల్లోకెళితే....

మైదుకూరు, ఆగస్టు 20: శ్రావణమాసంలో మహిళలకు ముఖ్యమైన పండుగ  వరలక్ష్మీ దేవి  వ్రతం.  పట్టణంలోని అమ్మవారిశాల లో శుక్రవారం ఆర్యవైశ్య మహిళా మండలి అధ్యక్షురాలు మాలేపాటి పద్మజ ఆధ్వర్యంలో వాసవీమాతను వరలక్ష్మిదేవిగా అలంకరించి మహిళలచే సామూహిక కుంకుమార్చనలు చేపట్టారు. స్థానిక సాయిబాబా ఆలయం నుంచి మహిళలు అమ్మవారికి వడ్డిబియ్యం ను ఊరేగింపుగా తీసుకువచ్చి వాసవీమాత కు వల్లింపులు చేశారు. భక్తాదులకు  అన్నప్ర సాదం పంపిణీ చేశారు. 

దువ్వూరు మండలంలో....

దువ్వూరు, ఆగస్టు 20: వరలక్ష్మి వ్రతాన్ని దువ్వూరు, గుడిపాడు, పెద్దజొన్నవరం, పుల్లా రెడ్డిపేట గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. కోదండరామస్వామి దేవస్థానంలో అమ్మవారి ని ప్రత్యేకంగా అలకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దజొన్నవరంలో కొత్తగా నిర్మించిన రామాలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని మహిళలు ఆచరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదాలు అందించారు.

పులివెందుల మండలంలో....

పులివెందుల టౌన్‌, ఆగస్టు 20: పట్టణంలోని శ్రీమహాలక్ష్మీ దేవాలయంలో శ్రావణ శుక్రవా రం పూజలు ఘనంగా నిర్వహించారు. ఉద యం ఆలయ పూజారి అమ్మవారికి ప్రత్యేక తోమాలతో అలంకరించారు. ఆలయ ధర్మకర్త లు, కమిటీ సభ్యులు తూగుట్ల రామచంద్రా రెడ్డి, సరోజమ్మ దంపతులు, టీడీపీ నేత తూ గుట్ల మధు సూదన్‌రెడ్డి దంపతుల ఆధ్వర్యం లో ఆలయ పూజారి ప్రత్యేక పూజలు నిర్వ హించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

నిడివెలగల ఆంజనేయస్వామి ఆలయంలో...

సింహాద్రిపురం, ఆగస్టు 20: పురాతన పవిత్ర క్షేత్రం నిడివెలగల ఆంజనేయస్వామి ఆల యంలో శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు మధుసూదన్‌రావు ఆధ్వ ర్యంలో పూజలు నిర్వహించారు. ఆలయ ధ ర్మకర్త లక్ష్మీనారాయణరెడ్డి భక్తులకు తీర్థ, ప్ర సాదాలు ఏర్పాటు చేశారు. చుట్టు ప్రక్కల గ్రామాల భక్తులు వచ్చి వ్రతంలో పాల్గొన్నా రు.  మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో మహిళలు భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు.

పోరుమామిళ్ల మండలంలో....

పోరుమామిళ్ల, ఆగస్టు 20: వరలక్ష్మీ అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా లక్ష్మి వేం కటేశ్వరస్వామి దేవాలయంలో వరలక్ష్మీ అ మ్మవారికి పూజలు చేశారు. కార్య్రమానికి మహిళలు అధిక సంఖ్యలో హాజరై పూజలు చేశారు. సర్పంచ్‌ యనమల సుధాకర్‌, టీడీ పీ నేతలు శీతా వెంకటసుబ్బయ్యను దేవస్థానం అధ్యక్షుడు తులసి సురే్‌షబాబు, మా జీ అధ్యక్షుడు శిరీ్‌షకుమార్‌ సన్మానించారు.

కాశినాయన మండలంలో....

కాశినాయన ఆగస్టు20: వరలక్ష్మీ వ్రతాన్ని మండల వాసులుభక్తి శ్రద్ధలతో చేసుకున్నా రు. మహిళలు వేకుజామునే లేచి ఇల్లు శుభ్రపరుచుకుని శుచి శుభ్రతతో అమ్మవారికి ప్ర త్యేక పూజలు చేశారు. అనంతరం పలువురు ముత్తైదువులకు వాయనాలు పంచారు.





Updated Date - 2021-08-21T05:03:15+05:30 IST