50 శాతం మించని వ్యాక్సినేషన

ABN , First Publish Date - 2021-01-21T04:59:34+05:30 IST

ముఖ్యమంత్రి సొంతూరు పులివెందులలో, మైదుకూరులో వ్యాక్సినేషన్‌ 50 శాతం కూడా మించలేదు..

50 శాతం మించని వ్యాక్సినేషన
సురభి వైద్యశాలలో వైద్యసిబ్బందికి వ్యాక్సినేషన అనంతరం అబ్జర్వేషనలో ఉంచిన దృశ్యం

 ముఖ్యమంత్రి సొంతూరు పులివెందులలో, మైదుకూరులో వ్యాక్సినేషన్‌ 50 శాతం కూడా మించలేదు..  అయితే కలసపాడు మండలంలో 83 మందికి, బి.కోడూరులో 57, కాశినాయనలో 56, వేములలో 86, చక్రాయపేటలో 82, ఖాజీపేటలో 71, చాపాడులో 70, బి.మఠంలో60, అట్లూరులో 74, లింగాలలో 129  మందికి వ్యాక్సినేషన్‌ చేయించారు. వివరాల్లోకెళితే....

పులివెందుల, జనవరి 20: పులివెందుల ఏరియా ఆస్పత్రిలో నిర్వహించిన వ్యాక్సి నేషన్‌లో ఐదు రోజులకు కలిపి 256 మందికి టీకాలు వేశారని సూపరింటెం డెంట్‌ మధుసూదనరెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 88మంది పురుషులకు, 168మంది మహిళలకు వ్యాక్సిన అందిం చినట్లు అధికారులు తెలిపారు.  

మైదుకూరులో 50 శాతంలోపే...

మైదుకూరు, జనవరి 20: మైదుకూ రులో ఐదురోజులకు 50 శాతం మందికే వ్యాక్సినేషన్‌ చేసినట్లు ఆస్పత్రి సూపరిం టెండెంట్‌ ఖదీర్‌ అహ్మద్‌ పేర్కొన్నారు. రోజుకు వంద మందికి వేయాల్సి ఉండ గా ఐదు రోజులకు 236 మంది మాత్ర మే వేయించుకున్నారు. 

కలసపాడు/కాశినాయన/ బి.కోడూరు/ వేముల/ చక్రాయపేట/ సింహాద్రిపురం/ ఖాజీపేట/చాపాడు/బి.మఠం/అట్లూరు/లింగాల,జనవరి 20: కలసపాడు మండలంలో 83 మందికి వ్యాక్సిన వేశామని వైద్యాఽధికారి వెంకటసుబ్బయ్య తెలిపారు. బి.కోడూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో 57 మందికి టీకాలు వేయించారు. డీఎంహెచఓ ఖాదర్‌వలి, వైద్యాఽధికారి వర్ధనరెడ్డి, ఎంపీడీఓ ఉమామహేశ్వర్‌రావు, తహసీల్దారు మధురవాణి పాల్గొన్నారు.

కాశినాయన మండల కేంద్రం నర్సాపురం పీహెచ్‌సీలో 56 మందికి వ్యాక్సినేషన్‌ చేసినట్లు డాక్టర్‌ కిరణ్‌ప్రసాద్‌ తెలిపా రు. మొత్తం 83 మందికి వేయాల్సి ఉం డగా మొదటిరోజు 56 మందికి వేశామ ని, మిగిలిన వారికి గురువారం వేస్తామన్నారు. వేముల పీహెచసీలో 86మందికి వ్యాక్సిన వేసినట్లు మండల వైద్యాధికారి ఉమాదేవి తెలిపారు.

స్థానిక పీహెచ సీలో వ్యాక్సినేషన చేసినట్లు తెలిపారు. చక్రాయపేట మండలం సురభిలో 82 మందికి వ్యాక్సినేషన చేసినట్లు డాక్టర్‌ శ్రీధర్‌రెడ్డి, డాక్టర్‌ చందన తెలిపారు. మండలంలో 120మంది పేర్లు నమోద వగా 82 మందికి వ్యాక్సిన వేశారు.  గురువారం కూడా వ్యాక్సినేషన ఉంటుందన్నారు. సింహాద్రిపురం ప్రాధ మిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సి బ్బంది కి, అంగన వాడీ సిబ్బందికి డాక్టర్‌ అనిల్‌కుమార్‌ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్‌ చేశారు.

ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వ్యాక్సినేషన్‌ చేయించుకోవాలని తెలిపా రు. ఖాజీపేట మండలంలో 71 మందికి వ్యాక్సినేషన్‌ చేసినట్లు మండల అభివృద్ధి అధికారి మైథిలి, వైద్యాధికారులు టి.సెల్వియా సాల్మన్‌, ఫణీంద్ర, సుమన్‌ తెలిపారు. మొదట ఆరోగ్య విస్తరణాధికారి ఎం రాఘవయ్యకు టీకా వేసి ప్రారంభించారు. మండలానికి 300 డోసులు వచ్చాయన్నారు.

వ్యాక్సిన సురక్షితమని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అన్నారు. చాపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మొదట డాక్టర్‌ జ్యోత్స్నారెడ్డి టీకా వేయించుకుని మరో 70 మంది ఏ ఎనఎంలు, ఇతర సిబ్బందికి వేసినట్లు తెలిపారు. గురువారం మిగిలిన వారికి టీకాలు వేస్తున్నట్లు ఆమె తెలిపారు. బ్రహ్మంగారిమఠం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 101 మందికి గాను 60 మం దికి వ్యాక్సినేషన చేసినట్లు మండల వైద్యాధికారి ఫళణిరాజు తెలిపారు.

అడి షనల్‌ డీఎంహెచఓ ఖాదర్‌వల్లి, హెల్త్‌అ సిస్టెంట్‌ మాధవనాయుడు, తహసీల్దా రు దైవాదీనం, ఎంపీడీఓ వెంగముని రెడ్డి, వైసీపీ నేతలు, వైద్య, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అట్లూరు జడ్పీ హైస్కూల్‌లో ప్రారంభించిన వ్యాక్సినేష న్‌కు స్పందన లభించింది. మండలంలో 74 మందికి టీకాలు వేయించినట్లు డీఎంహెచఓ డాక్టర్‌ అనిల్‌కుమార్‌, డాక్టర్‌ లక్ష్మికర్‌ అన్నారు. 

లింగాల, జనవరి 20: లింగాలలో  129 మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు వైద్యాధి కారి సుభాషిణి తెలిపారు. బుధవారం స్థానిక జడ్పీ హైస్కూల్‌ వద్ద ఈ కార్యక్ర మం నిర్వహించగా అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, వైద్యసిబ్బందికి వ్యాక్సినను అందించామన్నారు. కార్యక్రమంలో తహ సీల్దార్‌ ఆంజనేయులు, ఎంపీడీఓ సురేం ద్రనాథ్‌, ఎస్‌ఐ హాజీవల్లి, సీహెచఓ మోహనరావు తదితరులు పాల్గొన్నారు. Updated Date - 2021-01-21T04:59:34+05:30 IST