పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

ABN , First Publish Date - 2021-12-26T05:06:55+05:30 IST

వసంతపేట మున్సిపల్‌ హైస్కూల్‌లో 1986వ సంవత్సరం పదో తరగతి పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం శనివారం ఘనంగా నిర్వహించారు.

పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం
వసంతపేట పాఠశాలలో సమావేశమైన పూర్వ విద్యార్థులు

ప్రొద్దుటూరు టౌన్‌, డిసెంబరు 25 : వసంతపేట మున్సిపల్‌ హైస్కూల్‌లో 1986వ సంవత్సరం పదో తరగతి పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం శనివారం ఘనంగా నిర్వహించారు. 35 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థులు ఒకే చోటికి చేరి తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆనాడు విద్యాబోధన చేసిన ఉపాధ్యాయులు ఏసీ దస్తగిరి, పుల్లారెడ్డి, నారపురెడ్డి, శివరామిరెడ్డి, బషీర్‌ అహ్మద్‌, కాంతాబాయిలను పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ ఆనాడు ఉపాధ్యాయుల అంకిత భావం, విద్యాబోధన వల్లే తాము ఈ స్థాయిలో ఉన్నామని పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న పూర్వ విద్యార్థులు ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-26T05:06:55+05:30 IST