గుర్తు తెలియని వాహనం ఢీ: వృద్ధుడు మృతి

ABN , First Publish Date - 2021-08-21T04:56:41+05:30 IST

కడప- క ర్నూలు జాతీయ రహదారి స్థానిక పాటిమీద పల్లె సమీపంలో ఓ వృ ద్ధుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే దుర్మర ణం చెందాడు.

గుర్తు తెలియని వాహనం ఢీ: వృద్ధుడు మృతి
మృతిచెందిన నరసయ్య

ఖాజీపేట, ఆగస్టు 20: కడప- క ర్నూలు జాతీయ రహదారి స్థానిక పాటిమీద పల్లె సమీపంలో ఓ వృ ద్ధుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే దుర్మర ణం చెందాడు. స్థానిక పాటి మీద పల్లెకు చెందిన ఇ.నరసయ్య (60) గత కొంత కాలంగా జాతీయ రహ దారి పక్కనే భిక్షాటన చేస్తూ జీవ నం సాగించేవాడు. రోజులాగే శుక్ర వారం జాతీయ రహదారి పక్కనే ఉండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో నరసయ్య పక్కనే ఉన్న పొలం లో ఎగిరిపడి మృతిచెందాడు. సాయంత్రం స్థానికులు పోలీసులకు సమాచారం అం దించారు. పోస్టుమార్టం నిమిత్తం నరసయ్యను కడప రిమ్స్‌కు తరలించారు. 

Updated Date - 2021-08-21T04:56:41+05:30 IST