రైతు భరోసా కేంద్రాల ఆకస్మిక తనిఖీ

ABN , First Publish Date - 2021-01-13T05:33:01+05:30 IST

సరస్వతిపల్లెపరిధిలో ఉన్న రైతు భరోసా కేంద్రాలను మంగళవారం వ్యవసాయశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ మురళీకృష్ణ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు.

రైతు భరోసా కేంద్రాల ఆకస్మిక తనిఖీ

రామాపురం, జనవరి12: సరస్వతిపల్లెపరిధిలో ఉన్న రైతు భరోసా కేంద్రాలను మంగళవారం వ్యవసాయశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ మురళీకృష్ణ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ఉన్న జిప్సం బస్తాలు చెదురుముదురుగా ఉండడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోవాలని సిబ్బందికి సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నివర్‌ తుఫాన్‌ కారణంగా పంట నష్టపోయిన వేరుశనగ రైతులకు 80 శాతం సబ్సిడీతో వేరుశనక్కాయలు రైతులకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. రాయచోటి, లక్కిరెడ్డిపల్లె డివిజన్లకు నివర్‌ తుఫాను 5 వేలు క్వింటాళ్లు సబ్సిడీ  కింద వేరుశనగ విత్తనపు కాయలు మంజూరయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో నాగమణి, భార్గవి, సింగిల్‌విండో అధ్యక్షుడు పెద్దిరెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-13T05:33:01+05:30 IST