రాష్ట్రంలో దౌర్జన్య పాలన

ABN , First Publish Date - 2021-11-10T05:01:07+05:30 IST

రాష్ట్రంలో దౌర్జన్య పాలన సాగుతోందని, శాంతియుతంగా నిరసన చేస్తే అరెస్టు చేయడం ఏమిటని టీటీడీ మాజీ చైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ పేర్కొన్నారు.

రాష్ట్రంలో దౌర్జన్య పాలన
పుట్టాను ప్రొద్దుటూరులో హౌస్‌ అరెస్టు చేసిన పోలీసులు

మైదుకూరు, నవంబరు 9 : రాష్ట్రంలో దౌర్జన్య పాలన సాగుతోందని, శాంతియుతంగా నిరసన చేస్తే అరెస్టు చేయడం ఏమిటని టీటీడీ మాజీ చైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ పేర్కొన్నారు. పెట్రో, డీజల్‌పై రాష్ట్రంలో ధరలు తగ్గించాలని మంగళవారం మైదుకూరులోని పెట్రోల్‌ బంకు వద్ద నిరసన చేపట్టడానికి వస్తుంటే పోలీసులు దౌర్జన్యంగా అడ్డుకొని పోలీస్‌ స్టేషన్‌కు తరలించడం ఎంత వరకు సమంజసమన్నారు. పెట్రోలు, డీజల్‌ ధరలను కేంద్ర తగ్గించిందని, ఈ మేరకు పొరుగు రాష్ట్రాల్లో కూడా వారి వాటా కింద మరింత తగ్గించారని, అయితే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం రేట్లు తగ్గించకుండా కుంటిసాకులు చెబుతున్నారన్నారు. అంతా ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. కాగా నిరసన చేపట్టకుండా పుట్టా సుధాకర్‌యాదవ్‌ను పోలీసులు హౌస్‌ అరె స్టు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు దాసరి బాబు, నా యకులు ఆర్‌ శ్రీనివాసులు, ఆకుల క్రిష్ణయ్య, కొండపల్లి ఉమాకాంత్‌, పిచ్చపాటి మునిశేఖర్‌రెడ్డి, నేట్లపల్లి శివరాం, పొలిమేర మహేంద్రకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-10T05:01:07+05:30 IST