ద్విచక్ర వాహనాలు ఢీ... ఒకరి మృతి

ABN , First Publish Date - 2021-09-03T04:53:21+05:30 IST

మండల కేంద్రమైన కలసపాడుకు పక్కనే ఉన్న పెట్రో లు బంకు వద్ద బుధవారం రాత్రి ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో షేక్‌ రసూల్‌ (38) అనే వ్యక్తి మృతి చెందాడు.

ద్విచక్ర వాహనాలు ఢీ... ఒకరి మృతి

కలసపాడు, సెప్టెంబరు 2: మండల కేంద్రమైన కలసపాడుకు పక్కనే ఉన్న పెట్రో లు బంకు వద్ద బుధవారం రాత్రి ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో షేక్‌ రసూల్‌ (38) అనే వ్యక్తి మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. ఎగువతంబళ్లపల్లెకు చెందిన రసూల్‌ పెట్రోలు పట్టించుకుని బయటకు వస్తుండగా చింతలపల్లెకు చెందిన శ్రీనివాసులు అనే ఆర్మీ ఉద్యోగి ద్విచక్ర వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే రసూల్‌ను పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడు కలసపాడులో బంగారు దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈయనకు భార్య నూర్జహాన్‌, పాప, బాబు ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎ్‌సఐ సుబ్బారావు తెలిపారు. 

Updated Date - 2021-09-03T04:53:21+05:30 IST