రెండు బైకులు ఢీ : ఇద్దరికి తీవ్ర గాయాలు
ABN , First Publish Date - 2021-05-06T04:54:58+05:30 IST
రామాపురం మండలం కుమ్మరపల్లె సమీపంలోని చెరువు వద్ద బుధవారం రెండు బైకులు ఢీకొని ఇరువురికి తీవ్రగాయాలైనట్లు ఎస్‌ఐ జయరాములు తెలిపారు.

రామాపురం, మే 5: రామాపురం మండలం కుమ్మరపల్లె సమీపంలోని చెరువు వద్ద బుధవారం రెండు బైకులు ఢీకొని ఇరువురికి తీవ్రగాయాలైనట్లు ఎస్‌ఐ జయరాములు తెలిపారు. ఆయన కథనం మేరకు... రాయచోటి పట్టణానికి చెందిన ఇరువురు లక్కిరెడ్డిపల్లె నుంచి రాయచోటికి బైకు లో వెళుతుండగా మార్గమధ్యంలో కుమ్మరపల్లె చెరువు సమీపానికి రాగానే అడవి పందులు రోడ్డుకు అడ్డం వచ్చాయి. వాటిని తప్పించుకోబోయి ముందు వైపు వెళ్తున్న బైకును ఢీకొన్నాడు. ఈ సంఘటనలో హరిశంకర్, మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి రామాపురం పోలీసులు చేరుకుని చికిత్స కోసం 108 వాహనం ద్వారా రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.