బద్వేల్‌లో 90వేల దొంగఓట్లు: తులసిరెడ్డి

ABN , First Publish Date - 2021-11-02T17:19:04+05:30 IST

అమరావతి: బద్వేల్‌ ఉపఎన్నికలో మొత్తం లక్షా 46వేల 562 ఓట్లు పోలయ్యాయని తులసి రెడ్డి అన్నారు.

బద్వేల్‌లో 90వేల దొంగఓట్లు: తులసిరెడ్డి

అమరావతి: బద్వేల్‌ ఉపఎన్నికలో మొత్తం లక్షా 46వేల 562 ఓట్లు పోలయ్యాయని.. అందులో ప్రజలు 40 శాతం ఓట్లు వేశారని, దొంగఓట్లు 60 శాతమని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ  ఈ మొత్తం ఓట్లలో దాదాపు 90 వేలు దొంగఓట్లని అన్నారు. 56వేలు ప్రజలు వేసిన ఓట్లన్నారు. అధికారపార్టీ నేతలు ఓటుకు రూ. 5వందలు ఇచ్చారన్నారు. ఉదయం 11 గంటల తర్వాత వైసీపీ కార్యకర్తలు సీమ నుంచి వచ్చి అధికారపార్టీకి దొంగఓట్లు వేశారన్నారు. చెప్పాలంటే క్షేత్రస్థాయిలో ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ బలహీనంగా ఉన్నాయన్నారు. దానికి తోడు వాళ్లపై అధికారపార్టీ కక్షలు, కేసులతో బెదిరింపులకు గురిచేసిందని, ప్రజలు స్వచ్చంధంగా ఓటు వేసే పరిస్థితి లేదని తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-11-02T17:19:04+05:30 IST