బంగారు లాకర్లను తనిఖీ చేసిన టీటీడీ అధికారులు

ABN , First Publish Date - 2021-12-31T05:02:52+05:30 IST

కోదండరామాలయంలోని రామాలయం లాకర్లను టీటీడీ ఆధ్వర్యంలోని బంగారు తనిఖీ బృందం గురువారం తనిఖీ నిర్వహించారు.

బంగారు లాకర్లను తనిఖీ చేసిన టీటీడీ అధికారులు

ఒంటిమిట్ట, డిసెంబరు30 : కోదండరామాలయంలోని రామాలయం లాకర్లను టీటీడీ ఆధ్వర్యంలోని బంగారు తనిఖీ బృందం గురువారం తనిఖీ నిర్వహించారు. తిరుపతి నుంచి వచ్చిన బృందం ముందుగా స్థానిక స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో రామాలయం పేరు మీద ఉన్న లాకర్లను బ్యాంకు అధికారుల సమక్షంలో టీటీడీ బంగారు తనిఖీ అధికారులు సం యుక్తంగా లాకర్లను తెరిచి బంగారు లెక్కింపు చేపట్టారు. ప్రతి ఏటా కోదండరాముని ఆభరణాలను తనిఖీ చేస్తామని, అందు లో భాగంగానే గురువారం తనిఖీ నిర్వహించామని పేర్కొ న్నారు. బంగారు ఆభరణాల భద్రత, బరువును తనిఖీ చేశా మని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు నివేదిక తయారు చేసి టీటీడీ ఉన్నతాధికారులు అందజేస్తామన్నారు.

Updated Date - 2021-12-31T05:02:52+05:30 IST