రేపటి భారత్ బంద్‌ను జయప్రదం చేయండి
ABN , First Publish Date - 2021-03-25T04:57:48+05:30 IST
రైతు సంఘాలు, ఉద్యోగ కార్మిక సంఘాలు, పిలుపుమేరకు రేపటి భారత్ బంద్‌ను జయప్రదం చేయాలని సీఐ టీయూ జిల్లా కార్యదర్శి సీహెచ్ చంద్రశేఖర్ తెలిపారు.

రైల్వేకోడూరు రూరల్, మార్చి 24: రైతు సంఘాలు, ఉద్యోగ కార్మిక సంఘాలు, పిలుపుమేరకు రేపటి భారత్ బంద్‌ను జయప్రదం చేయాలని సీఐ టీయూ జిల్లా కార్యదర్శి సీహెచ్ చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం కోడూరు ఐసీడీఎస్ కార్యాలయం వద్ద అంగన్‌వాడీ వర్కర్స్,హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ అనుబంధం నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు రమాదేవి, ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, గౌరవ అధ్యక్షురాలు నిర్మల, రాధ, దుర్గ, వెన్నెల, శిరిష, లక్ష్మీ నరసమ్మ, జయ కుమారి, శోభ, ఇంద్ర తదితరులు పాల్గొన్నారు
చిట్వేలి..: కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ 26వ తేదీన నిర్వహిస్తున్న భారత్ బంద్‌ను జయప్రదం చేయాలని సీపీఎం, సీఐటీయూ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం స్థానిక మండల కార్యాలయం ఆవరణంలో సీపీఎం, సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం కెవిపిఎస్ కార్మిక, రైతు సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో వాల్‌పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్కిస్ట్ సీపీఎం మండల కమిటీ సభ్యులు పందికాళ్ల మణి, ఓబిలి పెంచలయ్య, మండల సీపీఎం నాయకులు ఎం.కృష్ణయ్య, ఓ.నరసింహులు, సీఐటీయూ యూనియన్ నాయకులు నరసింహ, వెంకటేష్, మణి, ఆటో యూనియన్ నాయకులు పెం చలయ్య, రమేష్, గంగాధర్, సుధాకర్, రమణ, లక్ష్మయ్య, రైతు సంఘం నాయకులు పెంచలయ్య, రామయ్య, నరసింహులు పాల్గొన్నారు.