కాకర్లకు సత్కారం

ABN , First Publish Date - 2021-12-26T05:30:00+05:30 IST

యూపీహెచ్‌సీలో 104 మిగులు సిబ్బందికి ఉద్యోగాలు వచ్చేందుకు కృషి చేసిన సచివాలయం ఉద్యోగుల చైర్మన్‌, ఏపీ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కాకర్ల వెకంటరామిరెడ్డిని యూపీహెచ్‌సీ ఉద్యోగులు ఘనంగా సత్కరించారు.

కాకర్లకు సత్కారం

కడప(మారుతీనగర్‌), డిసెంబరు 26: యూపీహెచ్‌సీలో 104 మిగులు సిబ్బందికి ఉద్యోగాలు వచ్చేందుకు కృషి చేసిన సచివాలయం ఉద్యోగుల చైర్మన్‌, ఏపీ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కాకర్ల వెకంటరామిరెడ్డిని యూపీహెచ్‌సీ ఉద్యోగులు ఘనంగా సత్కరించారు. ఈ మేరకు కడపలో ఆదివారం జరిగిన ఏపీజీఈఎఫ్‌ జిల్లా సమావేశానికి కాకర్ల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగులు ఆయనను శాలువా, పూలబొకేతో సత్కరించారు. 104 మిగులు సిబ్బందిలో 74 మంది ఏఎన్‌ఎంలకు ఉద్యోగం వచ్చేందుకు కాకర్ల చేసిన కృషి మిక్కిలి అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్‌, ఉద్యోగులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-26T05:30:00+05:30 IST