జిల్లాలో నలుగురు సీఐల బదిలీ
ABN , First Publish Date - 2021-12-16T04:45:31+05:30 IST
జిల్లాలో పనిచేస్తున్న నలుగురు సీఐలను బదిలీ చేస్తూ ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశాలు జారీ చేశారు.

కడప(క్రైం), డిసెంబరు 15 : జిల్లాలో పనిచేస్తున్న నలుగురు సీఐలను బదిలీ చేస్తూ ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశాలు జారీ చేశారు. బదిలీ అయిన సీఐలు తక్షణం వారికి కేటాయించిన స్థానాలలో రిపోర్టు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. పులివెందుల రూరల్‌లో పనిచేస్తున్న ఎన్.రవీంద్రనాధరెడ్డి ఎర్రగుంట్ల రూరల్‌కు బదిలీ అయ్యారు. అలాగే ఎర్రగుంట్ల రూరల్‌లో పనిచేస్తున్న కె.ఉలసయ్యను వీఆర్ కడప, కడప వీఆర్‌లో పనిచేస్తున్న ఎన్.రమే్‌షబాబును పోరుమామిళ్ల సర్కిల్‌కు, అలాగే అక్కడ విధులు నిర్వహిస్తున్న కె.మోహన్‌రెడ్డిని వీఆర్‌కు బదిలీ చేశారు.