కమలాపురంలో రైళ్లను ఆపాలి

ABN , First Publish Date - 2021-10-30T04:55:10+05:30 IST

నియోజకవర్గ కేంద్రమైన కమలాపురం రైల్వే స్టేషన్‌లో రైళ్లను ఆపాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీభట్ల సాయినాథశర్మ దక్షణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌కు పంపిన వినతిపత్రంలో కోరారు.

కమలాపురంలో రైళ్లను ఆపాలి

టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సాయినాథశర్మ

కమలాపురం(రూరల్‌), అక్టోబరు 29: నియోజకవర్గ కేంద్రమైన కమలాపురం రైల్వే స్టేషన్‌లో రైళ్లను ఆపాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీభట్ల సాయినాథశర్మ దక్షణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌కు పంపిన వినతిపత్రంలో కోరారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం విలేకర్లతో మాట్లాడుతూ కమలాపురం నియోజకవర్గ కేంద్రమైనప్పటికీ ప్రయాణికులు వెళ్లే ఒక్క రైలు కూడా ఇక్కడ ఆపకపోవడంతో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కరోనా మొదటిదశ ప్రారంభానికి ముందు ఈ స్టేషన్‌లో చాలా రైళ్లు నిలిపేవారని, అయితే గత రెండేళ్లుగా ఆగకపోవడంతో ఇక్కడి నుంచి ముంబై, హైదరాబాదు, తిరుపతి, వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కనీసం ప్యాసింజర్‌, ఇంటర్‌సిటీ రైళ్లు కూడా ఆపకపోవడం బాధాకరమన్నారు. తక్షణమే రైల్వే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. 


చంద్రబాబు సభపై దాడి సిగ్గుచేటు

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కుప్పంలో జరిపిన సభలో వైసీపీ నేతలు దాడి చేయాలనుకోవడం సిగ్గుచేటని సాయినాథశర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పర్యటనకు విచ్చేసిన జనసమూహాన్ని చూసి ఓర్వలేక ఇలాంటి చర ్యలకు దిగడం దారుణమన్నారు.

Updated Date - 2021-10-30T04:55:10+05:30 IST