రైతులకు పత్తి రకాల ఎంపికపై శిక్షణ

ABN , First Publish Date - 2021-12-10T04:28:14+05:30 IST

టి వెలమవారిపల్లెలో సుస్థిర వ్యవసాయ కేంద్రం ఆధ్వర్యంలో రైతుల భాగస్వామ్యంలో పత్తి రకాల ఎంపిక గురించి శిక్షణ ఇచ్చారు.

రైతులకు పత్తి రకాల ఎంపికపై శిక్షణ
పత్తి విత్తన కార్యక్రమంలో రైతులు సీఎస్‌ఏ ప్రతినిధులు

వేంపల్లె డిసెంబరు 9: టి వెలమవారిపల్లెలో సుస్థిర వ్యవసాయ కేంద్రం ఆధ్వర్యంలో రైతుల భాగస్వామ్యంలో పత్తి రకాల ఎంపిక గురించి శిక్షణ ఇచ్చారు. గురువారం నిర్వహించిన ఈ శిక్షణలో సీడ్‌ ట్రయిల్‌ అసిస్టెంట్‌ అశోక్‌, అగ్రికల్చర్‌ పీఓ బైరవ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఎంపిక చేసిన మేలైన పత్తి రకాలను ఉత్పత్తి చేసి రైతు ఉత్పత్తిదారుల సంఘం ద్వారా అందించడమే సుస్థిర వ్యవసాయ కేంద్రం లక్ష్యమన్నారు. పలు రకాల విత్తనాల గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ట్రైనర్‌ అశోక్‌, నాగవేనమ్మ, భాస్కర్‌, శివార్జునరెడ్డి, 22 మంది రైతులు హాజరయ్యారు. 

Updated Date - 2021-12-10T04:28:14+05:30 IST