ఉద్యాన నర్సరీల స్థాపనపై 25 నుంచి శిక్షణ

ABN , First Publish Date - 2021-08-22T05:00:01+05:30 IST

ఉద్యాన నర్సరీల స్థాపనపై ఈనెల 25 నుంచి శిక్షణ ఉంటుందని కృషి విజ్ఞానకేంద్రం సమన్వయకర్త డాక్టర్‌ వీరయ్య తెలిపారు.

ఉద్యాన నర్సరీల స్థాపనపై 25 నుంచి శిక్షణ

సీకేదిన్నె, ఆగస్టు 21: ఉద్యాన నర్సరీల స్థాపనపై ఈనెల 25 నుంచి శిక్షణ ఉంటుందని కృషి విజ్ఞానకేంద్రం సమన్వయకర్త డాక్టర్‌ వీరయ్య తెలిపారు. ఉద్యాన నర్సరీల స్థాపన, నిర్వహణపై శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి కల్పిస్తామ న్నారు. ఉద్యాన నర్సరీలకు అవకాశం మెండుగా ఉందన్నారు. జిల్లాలో పండ్ల మొక్కలు, కూరగాయల మొక్కలు, పూలమొక్కలు తదితర నారు మొక్కలకు ఏడాది పొడవునా డిమాండ్‌ ఉంటుం దన్నారు. దీంతో నర్సరీలకు మంచి అవకాశం ఉందని, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు ఉద్యానశాస్త్రవేత్త నాగిరెడ్డిని 7382129799 ఫోన్‌ నంబరును సం ప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.

Updated Date - 2021-08-22T05:00:01+05:30 IST