మూడు జిల్లాల పశు వైద్యులకు శిక్షణ

ABN , First Publish Date - 2021-03-25T04:34:39+05:30 IST

మండలంలోని గోపవరం సమీపంలో గల శ్రీ వెంకటేశ్వర పశువైద్య కళాశాలలో బుధవారం కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వెటర్నటరీ అసిస్టెంట్‌ సర్జన్‌గా పనిచేస్తున్న పశువైద్యులకు ఆధునిక పశుపోషణ, ఆరోగ్యం ప్రత్యుత్పత్తిలో ఆధునిక సాంకేతిక విధానాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

మూడు జిల్లాల పశు వైద్యులకు శిక్షణ
కార్యక్రమంలో మాట్లాడుతున్న డాక్టర్‌ వైకుంఠరావు

ప్రొద్దుటూరు రూరల్‌, మార్చి 24: మండలంలోని గోపవరం సమీపంలో గల శ్రీ వెంకటేశ్వర పశువైద్య కళాశాలలో బుధవారం కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వెటర్నటరీ అసిస్టెంట్‌ సర్జన్‌గా పనిచేస్తున్న పశువైద్యులకు ఆధునిక పశుపోషణ, ఆరోగ్యం ప్రత్యుత్పత్తిలో ఆధునిక సాంకేతిక విధానాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ వైకుంఠరావు మాట్లాడుతూ పాడిపరిశ్రమ అభివృద్ధి డెయిరీ డెవల్‌పమెంట్‌, మత్స్యశాఖ గురించి రాష్ట్రస్థాయి అధికారులు నిర్దేశించిన సూచనల మేరకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. క్షేత్రస్థాయి పశువైద్య అధికారులకు ఆధునిక పరిజ్ఞానాన్ని అందించడమే ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలోని అంశాలను పశుగణ వ్యవస్థాపక యాజమాన్య నిర్వహణ సంస్థ (స్మైల్‌) రూపొందించిన తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న నిపుణులు శిక్షణ అంశాలను వివరించారన్నారు. కార్యక్రమంలో పశువైద్య విస్తరణ విభాగం నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఎస్‌.శ్వేతక్రాంతి, నిపుణుల బృందం డాక్టర్‌ ప్రవీణ్‌, డాక్టర్‌ జ్యోతి, డాక్టర్‌ ఇందిర, డాక్టర్‌ పృధ్వి, డాక్టర్‌ సుధాకర్‌, డాక్టర్‌ శివజ్యోతి, డాక్టర్‌ కేశవ, డాక్టర్‌ ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-25T04:34:39+05:30 IST