భైరవ కోనకు రాకపోకలు బంద్‌ : రేంజర్‌

ABN , First Publish Date - 2021-04-29T04:32:49+05:30 IST

వనిపెంట సమీప అటవీ ప్రాంతం లో ఉన్న భైరవ కోనకు (మొండి భైరవి) రాకపోకలు బంద్‌ చేస్తున్నా మని అటవీ అధికారులు ప్రకటించారు.

భైరవ కోనకు రాకపోకలు బంద్‌ : రేంజర్‌

మైదుకూరు రూరల్‌, ఏప్రిల్‌ 28: వనిపెంట సమీప అటవీ ప్రాంతం లో ఉన్న భైరవ కోనకు (మొండి భైరవి) రాకపోకలు బంద్‌ చేస్తున్నా మని అటవీ అధికారులు ప్రకటించారు. కరోనా రెండో దశ వ్యాప్తి చెందుతోందని, దీని నివారణలో భాగంగా బైరవ కోనకు రాకపోకలు నిషేధించామని  వనిపెంట అటవీక్షేత్రాధికారి దినేష్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. భక్తులు సహకరించాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు.

Updated Date - 2021-04-29T04:32:49+05:30 IST