గ్రామాల్లో కొవిడ్ కట్టడికి పటిష్టమైన చర్యలు
ABN , First Publish Date - 2021-05-22T04:53:46+05:30 IST
గ్రామాల్లో కొవిడ్ కట్టడికి పటిష్టమైన చర్యలు చేపట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలు, మార్గదర్శకాలను అనుసరించి విలేజ్ లెవల్ కొవిడ్ -19 మేనేజ్మెంట్ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని శుక్రవారం కలెక్టర్ సి.హరికిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు.

విలేజ్ లెవల్ కొవిడ్ -19 మేనేజ్మెంట్ కమిటీ ఏర్పాటు : కలెక్టర్
కడప(కలెక్టరేట్) మే 21 : గ్రామాల్లో కొవిడ్ కట్టడికి పటిష్టమైన చర్యలు చేపట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలు, మార్గదర్శకాలను అనుసరించి విలేజ్ లెవల్ కొవిడ్ -19 మేనేజ్మెంట్ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని శుక్రవారం కలెక్టర్ సి.హరికిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు కొవిడ్ సెకండ్‌వేవ్ చాపకింద నీరులా వ్యాప్తి చెందుతున్నట్లు గమనించడం జరిగిందన్నారు. ఈ నేపధ్యంలో పల్లెల్లో కొవిడ్ వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా టెస్టింగ్ కాంట్రాక్ట్ ట్రేసింగ్, వాక్సినేషన్, ట్రీట్‌మెంట్ ప్రక్రియలు తప్పని సరని భావించిన ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. మెరుగైన ఫలితాల సాధనకోసం గ్రామీణ ప్రాంతాల్లో నిఘా, స్ర్కీనింగ్, ఐసోలేషన్, రెఫరల్స్ వ్యవస్థల్లో పటిష్టమైన చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు అన్ని స్థాయిల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, ఇతర ముఖ్యమైన ఆరోగ్య సేవలను బలోపేతం చేసి సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కింది చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.
విలేజ్ లెవల్ మేనేజ్మెంట్ కమిటీ ఏర్పాటు : గ్రామీణ ప్రాంతాల్లో కొవిడ్ -19 వ్యాప్తిని నిరోధించడానికి జిల్లా స్థాయిలో ఈసీఎంసీ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ గ్రామాల్లో కొవిడ్ వ్యాప్తి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రభుత్వ విధివిధానాలను, సక్రమంగా అమలు జరగేలా చర్యలు తీసుకుంటుంది. ఇందులో గ్రామ సర్పంచ్ చైర్మన్‌గా, మెంబరు, కన్వీనరుగా పంచాయతీ సెక్రటరీ వ్యవహరిస్తారు. వార్డు మెంబర్లు, వీఆర్వోలు, మహిళ పోలీసులు, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు, గ్రామ వలంటీర్లు కమిటీ మెంబర్లుగా వ్యవహరిస్తారని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు