నేడు విద్యాకానుక కిట్ల పంపిణీ
ABN , First Publish Date - 2021-09-04T05:18:18+05:30 IST
కడప నగరం వైఎ్‌సఆర్ ఆడిటోరియంలో శనివారం మదరసాలో చదువుతున్న విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లు పంపిణీ చేస్తున్నట్లు సమగ్ర శిక్ష జిల్లా పథక అధికారి ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.

కడప(ఎడ్యుకేషన్), సెప్టెంబరు 3: కడప నగరం వైఎ్‌సఆర్ ఆడిటోరియంలో శనివారం మదరసాలో చదువుతున్న విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లు పంపిణీ చేస్తున్నట్లు సమగ్ర శిక్ష జిల్లా పథక అధికారి ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా హాజరవుతారన్నారు. జిల్లాలోని 27 మదరసాల్లో చదువుతున్న 1433 మంది విద్యార్థులకు ప్రభుత్వం అందించే వివిధ రకాల కాంపోనెట్‌తో కూడిన విద్యాకానుక కిట్లు అందజేయనున్నట్లు తెలిపారు. నంజీలు, వలంటీర్లు, విద్యార్థులు హాజరుకావాలని కోరారు.