నేడు ప్రైవేటు విద్యాసంస్థల బంద్
ABN , First Publish Date - 2021-09-04T05:16:58+05:30 IST
ప్రైవేటు పాఠశాలల పట్ల ప్రభుత్వ వైఖరికి నిరసనగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రైవేటు పాఠశాలలు బంద్‌కు పిలుపునిచ్చినట్లు అపుస్మా కార్యవర్గం విజ్ఞప్తి చేసింది.

కడప, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ప్రైవేటు పాఠశాలల పట్ల ప్రభుత్వ వైఖరికి నిరసనగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రైవేటు పాఠశాలలు బంద్‌కు పిలుపునిచ్చినట్లు అపుస్మా కార్యవర్గం విజ్ఞప్తి చేసింది.రాష్ట్ర కార్యవర్గం తీసుకున్న నిర్ణయం మేరకు అసోసియేషన్‌లోని ప్రతిఒక్కరూ పాల్గొని బంద్ విజయవంతం చేయాలని కోరారు. అలాగే అందరూ నల్లబ్యాడ్జిలు ధరించి నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించినట్లు అపుస్మా కార్యవర్గం ప్రకటనలో పిలుపునిచ్చింది.