రేపు సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తాం టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ

ABN , First Publish Date - 2021-01-21T05:15:10+05:30 IST

పేద విద్యార్థులకు శాపంగా మారిన జీవో 77ను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోకపోతే 22వ తేదీన సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు వేణుగోపాల్‌ హెచ్చరించారు.

రేపు సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తాం  టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ

రాజంపేట, జనవరి20 : పేద విద్యార్థులకు శాపంగా మారిన జీవో 77ను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోకపోతే  22వ తేదీన సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు వేణుగోపాల్‌ హెచ్చరించారు. బుధవారం రాజంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ ఆధ్వర్యంలో 77వ జీవోను రద్దు చేయాలని కోరుతూ సీఎం కార్యాలయ ముట్టడి వాల్‌పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ జిల్లా ప్రచార కార్యదర్శి పోలి శివకుమార్‌, శివకృష్ణ, సురేంద్ర, వంశీ, చంద్ర, ఉమేష్‌, గోపాలకృష్ణ, మురళి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-21T05:15:10+05:30 IST