మూడు ట్రాక్టర్లు, జేసీబీ స్వాధీనం

ABN , First Publish Date - 2021-05-06T04:42:24+05:30 IST

ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్న మూడు ట్రాక్టర్లు, ఒక జేసీబీని పోలీసులు స్వాధీనం చేసు కున్నారు.

మూడు ట్రాక్టర్లు,  జేసీబీ స్వాధీనం
సీజ్‌ చేసిన ఇసుక ట్రాక్టర్లు

రాయచోటి, మే 5: ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్న మూడు ట్రాక్టర్లు, ఒక జేసీబీని పోలీసులు స్వాధీనం చేసు కున్నారు. పట్టణ పరిధిలోని పాత రాయచోటి సమీపంలో ఉన్న మాండవ్యనదిలో ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్న మూడు ట్రాక్టర్లు, జేసీబీని బుధవారం ఎస్‌ఈబీ (స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో) అధికారి భార్గవ్‌రెడ్డి, ఎస్‌ఐ నరసింహారెడ్డిలు స్వాఽధీనం చేసుకున్నారు. నలుగురు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను అధికారులు సీజ్‌ చేసినట్లు తెలియజేశారు.

Updated Date - 2021-05-06T04:42:24+05:30 IST