ఇది రైతు దగా దినోత్సవం

ABN , First Publish Date - 2021-07-09T05:02:57+05:30 IST

రైతు దినోత్సవం పేరున మరోసారి రైతులను వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తోందని రైతుల ను దగాచేసి రైతు దినోత్సవం నిర్వహించే అర్హత ము ఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి లేదని టీడీ పీ నియోజకవర్గ బాధ్యుడు డాక్టర్‌ ఓబుళాపురం రాజశేఖర్‌ పేర్కొన్నారు.

ఇది రైతు దగా దినోత్సవం

బద్వేలులో నిరసన తెలిపిన టీడీపీ నేతలు

బద్వేలు, జూలై8: రైతు దినోత్సవం పేరున మరోసారి రైతులను వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తోందని రైతుల ను దగాచేసి రైతు దినోత్సవం నిర్వహించే అర్హత ము ఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి లేదని టీడీ పీ నియోజకవర్గ బాధ్యుడు డాక్టర్‌ ఓబుళాపురం రాజశేఖర్‌ పేర్కొన్నారు. టీడీపీ కార్యాలయంలో నిరసన చేపట్టిన ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో రైతుల ను ఆదుకోవాల్సింది పోయి గాలికి వదిలేశారని, ఏ పం టకు మద్ధతు ధర దక్కడం లేదని, అలాగే రైతు భ రో సా కేంద్రాలు వైసీపీ కార్యకర్తలకు నిలయాలుగా మా రాయన్నారు.

ఈక్రాప్‌ బుకింగ్‌  నిర్లక్ష్యంతో 70 శాతం మంది రైతులు నష్టపోతున్నారన్నారు. టీడీపీ హయాం లో రైతు రుణమాఫీ కింద రూ.15,279కోట్లు చెల్లించారన్నారు. కార్యక్రమంలో మైనార్టీ కార్పొరేషన్‌ మాజీ డైరెక్ట ర్‌ మహబూబ్‌బాష, అశోక్‌రాజు, మల్లికార్జునరెడ్డి, కాల్వపల్లె సర్పంచ్‌ శ్రీనివాసులు, మిత్తికాయల రమణ, వెంగళరెడ్డి, వెంకటయ్య, కేవీ సుబ్బారెడ్డి, ఓబయ్య పాల్గొన్నారు.

Updated Date - 2021-07-09T05:02:57+05:30 IST