పకడ్బందీగా మూడో దశ ర్యాండమైజేషన్‌

ABN , First Publish Date - 2021-10-29T05:12:10+05:30 IST

బద్వేలు ఉప ఎన్నికలో ఈనెల 30వ తేదీ విధులు నిర్వహించే సిబ్బందికి 3వ దశ ర్యాండమైజేషన్‌ ప్రకియ్ర పకడ్బందీగా రూపొందించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ విజయరామరాజు సాధారణ పరిశీలకులు భీష్మకుమార్‌, పోలీసు అబ్జ ర్వర్‌ ఆర్‌ఆర్‌ఎస్‌ పరిహార్‌కు వివరించారు.

పకడ్బందీగా మూడో దశ ర్యాండమైజేషన్‌
ర్యాండమైజేషన్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌ విజయరామరాజు, పరిశీలకులు

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ విజయరామరాజు


కడప(కలెక్టరేట్‌), అక్టోబరు 28: బద్వేలు ఉప ఎన్నికలో ఈనెల 30వ తేదీ విధులు నిర్వహించే సిబ్బందికి  3వ దశ ర్యాండమైజేషన్‌ ప్రకియ్ర పకడ్బందీగా రూపొందించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ విజయరామరాజు సాధారణ పరిశీలకులు భీష్మకుమార్‌, పోలీసు అబ్జ ర్వర్‌ ఆర్‌ఆర్‌ఎస్‌ పరిహార్‌కు వివరించారు. గురువారం కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీలో బద్వేలు ఉప ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు సాఫ్ట్‌వేర్‌ ద్వారా పోలింగ్‌ సిబ్బంది 3వ దశ ర్యాండమైజేషన్‌ ప్రక్రియలో వారు పాల్గొని పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ బద్వేలు ఉప ఎన్నికల విధుల్లో 1124 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటారన్నారు. ఇందులో ఒక్కో పోలింగ్‌ కేంద్రానికి ఒక పీవో, ఒకఏపీవో, ఇద్దరు ఓపీవోలు విధులు నిర్వహిస్తారన్నారు. అలాగే 20 శాతం మంది సిబ్బందిని రిజర్వులో ఉంచడం జరిగిందన్నారు.  221 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలకు 221 మంది సూక్ష్మ పరిశీలకులను ర్యాండమైజేషన్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా నియమించడం జరిగిందన్నారు. వీరికి అదనంగా మరో 5 శాతం మంది రిజర్వులో కూడా నియమించినట్లు కలెక్టర్‌ పరిశీలకులకు వివరించారు. కార్యక్రమంలో డీఆర్వో మలోల, ఎన్‌ఐసీడీఐఓ విజయకుమార్‌, సీసీఓ వెంకటరావు, ఎన్నికల సూపరింటెండెంట్‌ శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-29T05:12:10+05:30 IST