‘మూడో దశ కొవిడ్‌ కట్టడికి చర్యలు’

ABN , First Publish Date - 2021-09-03T04:43:38+05:30 IST

మూడో దశ కొవిడ్‌ కట్టడికి, సీజనల్‌ వ్యాధుల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ నాగరాజు సంబంధిత వైద్యాధికారులను ఆదేశించారు.

‘మూడో దశ కొవిడ్‌  కట్టడికి  చర్యలు’

కడప(కలెక్టరేట్‌) సెప్టెంబరు 2: మూడో దశ కొవిడ్‌ కట్టడికి, సీజనల్‌ వ్యాధుల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ నాగరాజు సంబంధిత వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం డీఎంఅండ్‌ హెచ్‌వో కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్‌ నాగరాజు మాట్లాడుతూ గర్భిణుల నమోదు మూడు నెలల లోపు చేయాలన్నారు. ఆరోగ్యరిత్యా ప్రభుత్వపరంగా వైద్యసేవలు అందించి తల్లీబిడ్డల  ఆరోగ్యం పెంపొందించాలన్నారు. మాతృవందన వారోత్సవాలు ఈనెల 1 నుంచి 7వ తేదీ వరకు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో అదనపు డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ జ్యోత్స్న, డాక్టర్‌ లక్ష్మీకర్‌, ప్రోగ్రామ్‌ అధికారులు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-09-03T04:43:38+05:30 IST