రంగనాయకులపేటలో చోరీ
ABN , First Publish Date - 2021-03-25T04:36:41+05:30 IST
పట్టణంలోని రంగనాయకులపేటలో బుధవారం తెల్లవారుజామున యార్రా చెంగల్‌రెడ్డి అనే వ్యక్తికి చెందిన ఇంటిలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు.

9 తులాల బంగారు నగలు, రూ.లక్ష అపహరణ
రైల్వేకోడూరు రూరల్, మార్చి 24: పట్టణంలోని రంగనాయకులపేటలో బుధవారం తెల్లవారుజామున యార్రా చెంగల్‌రెడ్డి అనే వ్యక్తికి చెందిన ఇంటిలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. రైల్వేకోడూరు ఎస్‌ఐ-1 పెద్ద ఓబన్న కథనం మేరకు...వెంకటరెడ్డిపల్లెకు చెందిన చెంగల్‌రెడ్డి రైల్వేకోడూరు పట్టణంలోని రంగనాయకులపేటలో నివాసం ఉంటున్నాడు. అతడి భార్య కాన్పు కోసం పుట్టింటికి వెళ్లింది. ఇంటిలో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలోని 9 తులాల బంగారం, రూ.లక్ష నగదును దొంగిలించుకుని పోయినట్లు ఎస్‌ఐ వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
కోడూరులో గుట్కా పట్టివేత
రైల్వేకోడూరు, మార్చి 24: పట్టణంలోని పాతబస్టాండు వద్ద బుధవారం రైల్వేకోడూరు పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా మోటారు సైకిల్‌లో అక్రమంగా గుట్కా ప్యాకెట్లు తరలిస్తుండగా పట్టుకున్నారు. రైల్వేకోడూరు ఎస్‌ఐ-1 పెద్ద ఓబన్న కథనం మేరకు...మైనర్ బాలుడు మోటారు సైకిల్‌లో గుట్కా ప్యాకెట్లను తరలిస్తుండగా పట్టుకున్నామని ఆయన వివరించారు. వాటి విలువ రూ.20 వేలు ఉంటుందని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.