బంద్‌పై వైసీపీ వైఖరి ప్రకటించాలి
ABN , First Publish Date - 2021-03-25T04:33:41+05:30 IST
భారతబంద్‌పై వైసీపీ వైఖరి ఏమి టో ప్రకటించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖ ర్ డిమాండ్ చేశారు.

బద్వేలు, మార్చి24: భారతబంద్‌పై వైసీపీ వైఖరి ఏమి టో ప్రకటించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖ ర్ డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక సుందరయ్య భవన్‌లో చాంద్‌బాష అధ్యక్షతన 26న జరిగే భారతబంద్‌పై సీపీఎం, సీపీఐ, టీ డీపీ, కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడుతూ
రైతు పండించిన పంటల గిట్టుబాటు ధర కో సం ఢిల్లీలో పోరాడుతున్న రైతులపై లాఠీచార్జీ చేయించడం, దేశ్రదోహం కేసులు పెట్ట డం దారుణమన్నారు. దేశవ్యాప్త ఉద్యమంలో 250 మంది రైతుల మరణానికి బీజేపీ ప్రభు త్వం బాధ్యత వహించాలన్నారు. బీజేపీ తెచ్చి న చట్టాలను రద్దు చేయాలని కోరారు.
అంతే కాకుండా ఉద్యోగులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక రక్షణ చట్టాలను రద్దుచేసి ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయిమెంటును బీజేపీ అమలులోనికి తెచ్చిందని ఆరోపించారు. 26న జరిగే బంద్‌లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవం తం చేయాలని పిలుపు నిచ్చారు. ముస్లిం మైనార్టీ కార్పొరేషన మాజీ డైరెక్టర్ మహబూబ్‌బాష, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు డి.వెంకటేష్, ఆటోయూనియన నేత రమణ, మహిళా సంఘం నేత సలోమి, కళావతి, టీడీపీ నేత జహంగీర్ బాష పాల్గొన్నారు.
పోరుమామిళ్ల, మార్చి 24: భారత్ బంద్‌ను జయప్రదం చేయాలని సీపీఎం, సీపీఐ నేత లు భైరవ ప్రసాద్, కేశవ పేర్కొన్నారు. స్థానిక పెన్షనర్స్ అసోసియేషన కార్యాలయ ఆవరణలో బంద్ పోస్టర్లను ఆవిష్కరించి న వారు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రజల పై పెద్ద భారం మోపిందన్నారు. ఇలాంటి ప్రభుత్వాలను ఎండగట్టాలని, 26న ఉభయ కమ్యూనిస్టులు, రైతు సంఘాల ఆధ్వర్యంలో జరిగే భారతబంద్ జయప్రదం చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో గౌసియా, నారాయణమ్మ, బాలరాజు పాల్గొన్నారు.
సీఐటీయూ కార్యాలయంలో...
పులివెందుల రూరల్, మార్చి 24: బీజేపీ ప్రభుత్వం ప్రజావ్య తిరేక నిర్ణ యాలు మాను కోవాలని సీఐటీ యూ కార్యదర్శి గఫూర్, అంగ న్వాడీ సంఘం కార్యదర్శి సలీమా పేర్కొన్నారు. భారతబంద్‌ను జయప్రదం చేయాలని కోరుతూ సీఐటీయూ కార్యాలయం వద్ద పోస్టర్లను విడుదల చేశారు. ఇప్పటికే ఎల్‌ఐసీ, పెట్రోలియం, బ్యాంకింగ్, విమానాలు, రైల్వే ఇలా అనేక ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టింద ని ఆరోపించారు. సీఐటీయూ ప్రతి నిధులు సుధ, పద్మావతి, ఆమని, పద్మావతి, రాధిక, అనిత, మహేశ్వరి, నాగమ్మ, హరిత, మునే శ్వరి, లలిత, రామలలిత పాల్గొన్నారు.
మైదుకూరులో...
మైదుకూరు, మార్చి 24: కేంద్ర వ్యతిరేక విధానాలను నిరసిస్తూ శుక్రవారం చేపట్టే దేశవ్యాప్త బంద్‌ను జయప్రదం చే యాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో కరప త్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా నాయకులు శ్రీరాములు, శివరాం మాట్లాడు తూ ఆహార భద్రత కల్పించకపోగా రైతులు, కార్మికులకు వ్యతిరేక చట్టాలను తెస్తూ ప్రభు త్వ రంగ సంస్థలను ప్రవేటీకరిస్తున్నార న్నా రు. ఈ బంద్‌లో వ్యాపారులు సహకరించాల ని కోరారు. కార్యక్రమంలో శ్రీనివాసులు, పవన్ తదితరులున్నారు.