విలువలు ఉన్నతికి మార్గం

ABN , First Publish Date - 2021-02-27T05:04:59+05:30 IST

విలువలతో కూడిన విద్య ఉన్నత స్థానానికి చేరుస్తుందని మానవత సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

విలువలు ఉన్నతికి మార్గం
నైతిక విలువలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న మానవత ప్రతినిధులు

పులివెందుల టౌన, ఫిబ్రవరి 26: విలువలతో కూడిన విద్య ఉన్నత స్థానానికి చేరుస్తుందని మానవత సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. స్థానిక మిట్టమల్లేశ్వర ఓరియంటల్‌ హైస్కూల్‌లో మానవత సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులు-నైతిక విలువలపై నిర్వహించిన అవగాహన సదస్సులో వక్తలు మాట్లాడారు.

అనంతరం ‘విద్యార్థులు-నైతిక విలువ లు’పై వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అం దించారు. కార్యక్రమంలో మానవ సంస్థ కన్వీనర్‌ కొండారెడ్డి, ప్రెసిడెం ట్‌ రామమోహన, డైరెక్టర్లు రాఘవరెడ్డి, హరిశ్చంద్రారెడ్డి, రామకృష్ణా రెడ్డి, హెచఎం విజయభాస్కర్‌రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-27T05:04:59+05:30 IST