త్రిపుర ప్రభుత్వాన్ని బర్త్‌రఫ్ చేయాలి
ABN , First Publish Date - 2021-11-06T05:12:29+05:30 IST
త్రిపుర రాష్ట్రంలో ముస్లింలపైనే గాకుండా వారి ఆస్తులు, మసీదులను పనిగట్టుకుని ధ్వంసం చేస్తున్నారని వెంటనే ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్త్‌రఫ్ చేయాలని మతగురువులు డిమాండ్ చేశారు.

ముస్లింలపై జరుగుతున్న దాడులకు నిరసనలో మతగురువులు
కడప(మారుతీనగర్), నవంబరు 5: త్రిపుర రాష్ట్రంలో ముస్లింలపైనే గాకుండా వారి ఆస్తులు, మసీదులను పనిగట్టుకుని ధ్వంసం చేస్తున్నారని వెంటనే ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్త్‌రఫ్ చేయాలని మతగురువులు డిమాండ్ చేశారు. త్రిపుర రాష్ట్రంలో ముస్లింలపై జరుగుతున్న దాడులు ఆపాలని డిమాండ్ చేస్తూ ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక 7 రోడ్లు కూడలి వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మత గురువులు మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముస్లింలు, దళితులు, మైనార్టీలపై దాడులకు తెగబడుతోందన్నారు. పైపెచ్చు వారి ఆస్తులను కూడా ధ్వంసంచేయడం దారణమన్నారు. మనదేశం సర్వమతాలకు నిలయంగా ఖ్యాతిగాంచిందని, ఐకమత్యంతో అన్నదమ్ములవలే మెలుగుతున్న ముస్లింలను వేరుచేయాలనే ఎత్తుగడ సరైందికాదన్నారు. ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం జోక్యంచేసుకొని త్రిపురలో ఇబ్బందులు పడుతున్న ముస్లింలకు అండగా నిలిచి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్త్‌రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మతగురువులు అహ్మద్‌బాబు బాయ్, మౌలానా నిజాముద్దీన్ బుఖారి, ఎం.వలివుల్లాహుస్సేని, ఎం.ముద్దస్సిర్, మౌలానా ముఫ్తి రహిముల్లాఖాన్, ఇనాయతుల్లాతో పాటు టీడీపీ, వైసీపీ, కాంగ్రె్‌సపార్టీల ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.