సమయం ఆసన్నమైంది : ఎమ్మెల్సీ
ABN , First Publish Date - 2021-10-22T04:57:05+05:30 IST
వైసీపీ నేతల దాడులను సమష్టిగా ఎదు ర్కొనే సమయం ఆసన్నమైందని ఎమ్మెల్సీ బీటెక్ రవి పేర్కొన్నారు.
పులివెందుల, అక్టోబరు 21: వైసీపీ నేతల దాడులను సమష్టిగా ఎదు ర్కొనే సమయం ఆసన్నమైందని ఎమ్మెల్సీ బీటెక్ రవి పేర్కొన్నారు. గురువారం విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో పార్టీ అధినేత చంద్రబాబు నిర్వహిస్తున్న 36గంటల దీక్షకు హాజరైన ఎమ్మెల్సీ బీటెక్ రవి సంపూర్ణ మద్దతు తెలిపాడు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏకంగా పార్టీ కార్యాలయంపై వైసీపీ మద్దతుదారులు దాడి చేయడం హేయమైన చర్య అన్నారు.
టీడీపీ నేతలపై భౌతిక దాడులు, పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘా తం కలిగిస్తోందన్నారు. డెమోక్రసీని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని స్పష్టం చేశారు. ప్రజల్లో చైతన్యం వచ్చి ప్రభుత్వం పై తిరగబడే రోజు త్వరలోనే ఉందని బీటెక్ రవి హెచ్చరించారు. ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకత దృష్టిని మళ్లించేందుకే కార్యాలయా లు, నేతలపై దాడులు చేస్తున్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.