ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు పోరాటం

ABN , First Publish Date - 2021-10-30T05:02:58+05:30 IST

కేం ద్ర ప్రభుత్వం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు నిధులు కేటాయించి విభజన హామీ నిలబెట్టుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మనోహర్‌, రామమోహన్‌లు పిలుపునిచ్చారు.

ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు పోరాటం

జమ్మలమడుగు రూరల్‌, అక్టోబరు 29: కేం ద్ర ప్రభుత్వం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు నిధులు కేటాయించి విభజన హామీ నిలబెట్టుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మనోహర్‌, రామమోహన్‌లు పిలుపునిచ్చారు. కేం ద్ర ప్రభుత్వం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు నిధులు కేటాయించి విభజన హామీ నిలబెట్టుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మనోహర్‌, రామమోహన్‌లు పిలుపునిచ్చారు. శుక్రవారం జమ్మలమడుగు ఎన్జీవో హోం నందు ఏర్పాటు చేసిన సీపీఎం రెండవ పట్టణ మహాసభ జరిగింది. ఈ మహాసభలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని తీర్మాణం చేయడం జరిగింది. వారు మాట్లాడుతూ గత ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కేం ద్రమే బాధ ్యత తీసుకుంటుందని చెప్పి నేడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. కడపజిల్లా ఒక్కటే కాదని, రాయలసీమ ప్రాంతం మొత్తం అభివృద్ధి చెందుతుందన్నారు. బీజేపీ రాజకీయ క్రీడల్లో ఉక్కు పరిశ్రమను పూర్తిగా విస్మరిస్తున్నారన్నారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సీపీఎం భవిష్యత్తులో శ్రీకారం చుట్టబోతోందన్నారు. ప్రజలు ఈ పో రాటంలో కలిసి ముందుకు రావాలని కోరారు. జిల్లా కమిటీ సభ్యులు శివనారాయణ, శివకుమార్‌, విజయ్‌, దాసు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-30T05:02:58+05:30 IST