మాజీ ప్రధాని వాజ్‌పేయి సేవలు మరువలేనివి

ABN , First Publish Date - 2021-12-26T05:06:16+05:30 IST

దివంగత మాజీ ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి దేశానికి అందించిన సేవలు మరువలేనివని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు.

మాజీ ప్రధాని వాజ్‌పేయి సేవలు మరువలేనివి
మాజీ ప్రధాని వాజ్‌పేయి, మదన్‌మోహన్‌ మాలవ్య చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న దృశ్యం

ప్రొద్దుటూరు టౌన్‌, డిసెంబరు 25 : దివంగత మాజీ ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి దేశానికి అందించిన సేవలు మరువలేనివని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు. వాజ్‌పేయి, బెనారస్‌ హిం దూ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుడు మదన్‌ మోహన్‌ మాలవ్య జయంతి సందర్భంగా శనివారం ఉపాధ్యాయ సేవా కేంద్రంలో వారి చిత్రపటాలకు ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన మంత్రి వాజ్‌పేయి స్వర్ణ చతుర్భుజి రోడ్డు నిర్మాణం చేపట్టి దేశంలో రవణా వ్యవస్థను వేగవంతం చేశారన్నారు. కార్యక్రమంలో సుబ్రమణ్యం, సుబ్బారెడ్డి, మధుసూదన్‌, రమణయ్య, ప్రభాకర్‌, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు

Updated Date - 2021-12-26T05:06:16+05:30 IST