రెండవ రోజు వైద్య సిబ్బంది నిరసన
ABN , First Publish Date - 2021-05-21T04:56:35+05:30 IST
రాష్ట్ర వైద్య, ఆరోగ్యకుటుంబ సంక్షేమ శాఖ కమిషనరు కాటమనేని భాస్కర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా గురువారం రెండవరోజు వైద్య ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరై నిరసన తెలిపారు.

కడప(కలెక్టరేట్), మే 20: రాష్ట్ర వైద్య, ఆరోగ్యకుటుంబ సంక్షేమ శాఖ కమిషనరు కాటమనేని భాస్కర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా గురువారం రెండవరోజు వైద్య ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరై నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఏపీ ఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె.శివారెడ్డి, జిల్లా అడిషనల్ డీఎంఅండ్‌హెచ్‌ఓ, ఎయిడ్స్, లెప్రసీ డాక్టర్ ఖాదర్‌వల్లి, వైద్యాధికారులు డాక్టర్ కె.చిరంజీవిరెడ్డి, డా.లక్ష్మీకర్, వైద్య ఉద్యోగులు పాల్గొన్నారు. శివారెడ్డి మాట్లాడుతూ కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అహర్నిశలు కాపాడుతున్న వైద్య సిబ్బందిపై అనుచిత వాఖ్యలు చేసినందుకు కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.