నిబంధనలు పక్కాగా పాటించాలి

ABN , First Publish Date - 2021-05-06T04:55:34+05:30 IST

కరోనా రెండవ దఫా అత్యంత ప్రమాదకరంగా విస్తరిస్తోందని ప్రభుత్వ నిబంధన లు పక్కాగా పాటించాలని డీఎస్పీ విజయకుమార్‌ సూచించారు.

నిబంధనలు పక్కాగా పాటించాలి
మైదుకూరులో కర్ఫ్యూను పర్యవేక్షిస్తున్న డీఎస్పీ

మైదుకూరు, మే 5: కరోనా రెండవ దఫా అత్యంత ప్రమాదకరంగా విస్తరిస్తోందని ప్రభుత్వ నిబంధన లు పక్కాగా పాటించాలని డీఎస్పీ విజయకుమార్‌ సూచించారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ అమలైందని ఈ మేరకు పట్టణం లోని పలు ప్రాంతాలను సీఐ చలపతి, ఎస్‌ఐలు సుబ్బారావు, రమణ కర్ఫ్యూను అమలు చేశారు. పట్టణంలోని వ్యాపార సంస్ధలను మూయించి రాకపోకలను నిషేధించారు. కర్ప్యూను డీఎస్పీ స్వ యంగా పర్యవేక్షించారు. కర్ప్యూ నిబంధనలు కఠి నంగా అమలు చేయాలని, ప్రధాన రహదారులను మూసిఅత్యవసర వాహనాలను పంపాలని సిబ్బంది కి తెలియచేశారు. 

బోసిపోయిన ప్రధాన రహదారులు

 కర్ఫ్యూతో పట్టణంలోని ప్రధాన రహదారులు బోసి పోయాయి. వ్యాపార సంస్థలు మూసివేయడంతో ప్రజలు రహదారులపై రాకపోకలు ఆగిపోయాయి. మొదటి రోజు కావడంతో ఆర్టీసీ బస్టాండ్‌లో మధ్యా హ్నం 12 గంటల వరకు 20 బస్సు సర్వీసులను 

నడిపారు. 12 తర్వాత మిగిలిపోయిన ప్రయాణికు లు తమకు బస్సులు వేయాలని ఆర్టీసీ సిబ్బందితో మొర పెట్టుకున్నారు. పోలీసులు విషయాన్ని వివ రించడంతో ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయించారు. 

చాపాడులో....

చాపాడు, మే 5: మండల కేంద్రమైన చాపాడులో కర్ఫ్యూ విధించారు. ఎస్‌ఐ హరిప్రసాద్‌, పోలీసులు దుకాణాలను మూసివేయించారు. ప్రభుత్వ ఆదేశా ల మేరకు రోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ కొనసాగుతుందన్నారు. ఇందుకు ప్రజలంద రూ సహకరించాలని కోరారు. వాహనదారులకు కర్ఫ్యూపై కౌన్సిలింగ్‌ ఇచ్చారు. ప్రొద్దుటూ రు-మైదు కూరు జాతీయ రహదారిపై తిరుగుతున్న వాహనా లను ఎస్‌ఐ నిలిపివేశారు. అంబులెన్సలు, పాలు, కూరగాయలు సరఫరా చేసే వాహనదారులకు మినహాయింపు ఉంటుందన్నారు.

పోరుమామిళ్లలో....

పోరుమామిళ్ల, మే 5: ప్రతి ఒక్కరూ కర్ఫ్యూ నిబంధనలు పాటించాలని సీఐ మోహనరెడ్డి, ఎస్‌ఐ మోహన అన్నారు. బుధవారం ఆర్టీసీ బస్టాండు, రామచంద్ర రిక్రియేషన క్లబ్‌ సర్కిల్‌ ప్రాంతాల్లో వాహనాల తనిఖీ చేశారు. కర్ఫ్యూ నిబంధనలకు విరుద్దంగా వాహనాలు నడుపుతున్న, మాస్కులు లేకుండా తిరుగుతున్న వారికి కౌన్సెలింగ్‌ చేశారు.  

పులివెందులలో....

పులివెందుల రూరల్‌, మే 5: ప్రభుత్వం విధించిన కర్ఫ్యూను పులివెందులలో అధికారులు కఠినంగా అమలు చేశారు. పోలీసులు, కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ 12గంటలకు అన్ని వ్యాపారాలు మూతపడే లా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు ప్రజలు కూ డా స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు.  ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడంతో కొందరు ప్రయాణీ కులు బస్టాండ్‌లోనే ఉండిపోయారు. 

వేంపల్లెలో....

వేంపల్లె, మే 5: కరోనా మహమ్మారి నిర్మూలనకు ప్రజలంతా సమష్టి కృషి అందిస్తే రూపుమాపవ చ్చని సీఐ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఇళ్లలోనే ఉంటూ అత్యవసరమైతే మాస్కు పెట్టుకుని బయ టకు రావాలని ఆయన సూచించారు. వేంపల్లెలో అమలు అవుతున్న కర్ఫ్యూను సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐలు మల్లికార్జునరెడ్డి, సుభాష్‌చంద్రబోస్‌ పర్యవే క్షణలో సిబ్బంది ప్రజలను అప్రమత్తం చేశారు.

బి.మఠంలో....

బ్రహ్మంగారిమఠం, మే 5: బ్రహ్మంగారిమఠంలో కర్ఫ్యూ కట్టుదిట్టంగా అమలు చేశారు. భౌతిక దూ రం పాటిస్తూ మాస్కులు ధరించి ప్రాణాలు కాపా డు కోవాలని ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. మండ లంలో కేసులు పెరుగుతున్నాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు ఫళణిరా జు, వెంకటనాగేంద్ర తెలిపారు. అత్యవసరమైతేనే మాస్కులు ధరించి బయటకు రావాలని తెలిపారు.  


హోటళ్లలో పార్శిల్స్‌కు అనుమతి 

పులివెందుల టౌన, మే 5: పట్టణంలోని హోటళ్లలో పార్శిల్స్‌కు అనుమతి ఇస్తున్నట్లు మున్సిపల్‌ కమిష నర్‌ నరసింహారెడ్డి పేర్కొన్నారు.  మధ్యాహ్నం 12గం టల తర్వాత కర్ఫ్యూ సమయంలో 2గంటల వరకు, సాయంత్రం 6గంటల నుంచి 9గంటల వరకు పార్శి ల్స్‌కు పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌ రెడ్డి అనుమతి చ్చినట్లు తెలిపారు.

పులివెదుల కొవిడ్‌ టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ ఈమేరకు నిర్ణయం తీసుకుందన్నారు. దీంతో పాటు పాలు అమ్ముకునే వారికి కూడా నిబంధన మేరకు అమ్ముకోవచ్చన్నారు. నిబంధనలు ఉల్లంగిం చిన వారి అనుమతులు రద్దు చేస్తామన్నారు.





Updated Date - 2021-05-06T04:55:34+05:30 IST