పేలుడు ప్రమాదం దిగ్ర్భాంతికి గురి చేసింది
ABN , First Publish Date - 2021-05-09T04:43:02+05:30 IST
కలసపాడు మండలం మామిళపల్లె వద్ద ఉన్న ముగ్గురాయి గనిలో బ్లాస్టింగ్ జరిగి పది మంది మృతి చెందారనే వార్త తనను తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్.శ్రీనివాసరెడ్డి శనివారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు.

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి
కడప, మే 8 (ఆంధ్రజ్యోతి): కలసపాడు మండలం మామిళపల్లె వద్ద ఉన్న ముగ్గురాయి గనిలో బ్లాస్టింగ్ జరిగి పది మంది మృతి చెందారనే వార్త తనను తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్.శ్రీనివాసరెడ్డి శనివారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. పొట్టకూటి కోసం కూలి పనులకు పోయి ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమన్నారు. వెంటనే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం, తక్షణం పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. సంఘటనకు కారకులైన వారిని విచారించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.