సిమెంటు కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-12-10T04:36:35+05:30 IST

ప్రభుత్వం సిమెంటు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్‌ డిమాండ్‌ చేశారు.

సిమెంటు కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
మాట్లాడుతున్న సీఐటీయూ నేత మనోహర్‌

ప్రొద్దుటూరు టౌన్‌, డిసెంబరు 9 : ప్రభుత్వం సిమెంటు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్‌ డిమాండ్‌ చేశారు. సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ లోడింగ్‌, అన్‌లోడింగ్‌, ప్యాకింగ్‌ మినహా అన్ని పనులను ఉద్యోగ రూపంలో చూడాలన్నారు. కార్మికులకు మౌలిక వసతులు కల్పించడంలో సిమెంటు పరిశ్రమల యజమాన్యాలు విఫలమయ్యాయని తెలిపారు. సూప్రీంకోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదన్నారు. శుక్రవారం రాయలసీమ జిల్లాల సిమెంటు కార్మికుల సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.  సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, పట్టణ కార్యదర్శి విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-10T04:36:35+05:30 IST