సమాచారం అందకనే వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-05-21T04:52:27+05:30 IST

అరిగెల సురే్‌షబాబు మృతి సకాలంలో 108 సిబ్బందికి సమాచారం అందక పోవడంతోనే సంఘటన చోటు చేసుకుందని 108, 104 జిల్లా మేనేజరు ఇక్బాల్‌ తెలిపారు.

సమాచారం అందకనే వ్యక్తి మృతి
108 వాహనంలో రికార్డులను తనిఖీ చేస్తున్న దృశ్యం

విచారణ చేసిన 108 జిల్లా అధికారి ఇక్బాల్‌


మైదుకూరు, మే 20: అరిగెల సురే్‌షబాబు మృతి సకాలంలో 108 సిబ్బందికి సమాచారం అందక పోవడంతోనే సంఘటన చోటు చేసుకుందని 108, 104 జిల్లా మేనేజరు ఇక్బాల్‌ తెలిపారు. ఈనెల 14వ తేదీ సాయిబాబా ఆలయం వీధిలో సకాలంలో వైద్యం అందక అరిగెల సురే్‌షబాబు(39) మృతి చెందాడని ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైంది. దీనిపై అమరావతిలోని వైద్యశాఖ నుంచి స్థానిక మున్సిపల్‌ కమిషనరు రామక్రిష్ణను వివరణ కోరారు. గురువారం 108, 104 జిల్లా మేనేజరు ఇక్బాల్‌ మైదుకూరుకు చేరుకుని 108 సిబ్బందిని విచారించారు. తమకు ఎలాంటి సమాచారం లేదని ఆరోజు మైదుకూరుతో పాటు ఖాజీపేట, బి.మఠం వాహనాలు కరోనా రోగులతో బిజీగా ఉన్నాయని తెలిపారు. సంఘటన జరగడంపై విచారణ వ్యక్తం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా మైదుకూరు నియోజకవర్గం ప్రజలు అత్యవసరమైతే 8331032991 (మైదుకూరు), 6304496795 (ఖాజీపేట), 8331032980 (చాపాడు) 8331033308 (బి.మఠం) స్థానిక 108 సిబ్బందికి నేరుగా చేసి విషయం చెప్పాలన్నారు. అనంతరం 108 కాల్‌ చేసి అన్‌లైన్‌లో నమోదు చేయించుకోవాలని, దీనివల్ల స్థానిక 108 వాహనం ఇంకొంచెం ముందుగా సంఘటనా స్థలానికి చేరుకుంటుందని ఆయన వివరించారు. 

Updated Date - 2021-05-21T04:52:27+05:30 IST