సెక్రటరీల పనితనం మెరుగుపడాలి

ABN , First Publish Date - 2021-07-13T05:12:24+05:30 IST

అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీలు వారి పనితనాన్ని మరింత మెరుగుపర్చుకోవాలని కమిషనర్‌ లవన్న సూచించారు. కడప కార్పొరేషన్‌ సమావేశంలో సోమవారం అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీలతో రివ్యూ మీటింగ్‌ నిర్వహించారు.

సెక్రటరీల పనితనం మెరుగుపడాలి
మాట్లాడుతున్న కమిషనరు లవన్న

కమిషనర్‌ లవన్న

కడప(ఎర్రముక్కపల్లె), జూలై 12: అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీలు వారి పనితనాన్ని మరింత మెరుగుపర్చుకోవాలని కమిషనర్‌ లవన్న సూచించారు. కడప కార్పొరేషన్‌ సమావేశంలో సోమవారం అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీలతో రివ్యూ మీటింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సచివాలయాల్లో ఉండేఅన్ని విభాగాల కార్యదర్శులపై సూపర్‌వైజింగ్‌ కలిగి ఉండాలన్నారు. ప్రధానంగా తమ డివిజన్‌ పరిఽఽధిలో ఉన్న పన్ను బకాయిలను వసూలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే పారిశుధ్యం, వీధిలైట్లు, తాగునీరు, రోడ్లుకు సంబంధించిన కార్యదర్శులను అప్రమత్తం చేయాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేషన్‌ మేనేజరు హిదయతుల్లా, కార్పొరేషన్‌ పరిధిలోని అన్ని సచివాలయాల అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీలు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-13T05:12:24+05:30 IST