వేసిన వాటికే గతిలేదు.. మళ్లీ శంకుస్థాపనలా..?

ABN , First Publish Date - 2021-12-20T04:49:01+05:30 IST

జిల్లాను అభివృద్ధి పథంలో నడుపుతున్నట్లు గత రెండేళ్ళుగా వేసిన శంకుస్థాపనలకే గతి లేదు.

వేసిన వాటికే గతిలేదు.. మళ్లీ శంకుస్థాపనలా..?
సమావేశంలో మాట్లాడుతున్న లింగారెడ్డి

 టీడీపీ  కడప పార్లమెంటు అధ్యక్షుడు లింగారెడ్డి

మైదుకూరు, డిసెంబరు 19: జిల్లాను అభివృద్ధి పథంలో నడుపుతున్నట్లు గత రెండేళ్ళుగా వేసిన  శంకుస్థాపనలకే గతి లేదు. మళ్ళీ ఇప్పుడు  శంకుస్ధాపనలకు సీఎం జగన్‌ రావడం ఏమిటని టీడీపీ కడప పార్లమెంటు అధ్యక్షుడు మల్లెల లిం గారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మైదుకూరులోని టీడీపీ కార్యా లయంలో  మైదుకూరు, కడప, జమ్మలమడుగు  నియోజకవ ర్గాల పార్టీ ఇన్‌చార్జ్‌లతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్య మంత్రి మన జిల్లా వాసి అని అందరూ ఓట్లేసి గెలిపిస్తే ఉన్న పథకాలన్నింటిని తీసేసి కొత్త పథకాలు ప్రవేశపెట్టారని, పెట్టిన వాటిలో కూడా కొన్నింటిని సక్రమంగా అమలు చేయ డంలేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చిన్నాభి న్నమైందని ఉద్యోగులకు సైతం జీతాలు ఇవ్వలేని స్ధితిలో ప్రభుత్వం ఉందన్నారు. జిల్లాలో కుందూ లెప్ట్‌ ఇరిగేషన్‌, రాజోలి రిజర్వాయర్‌,  స్టీల్‌ ప్లాంట్‌ తదితర వాటికి శంకు స్థాపనలు చేసేరా తప్ప ఇంత వరకు పనులు ప్రారంభించ లేదన్నారు. ఒక్కసారి ఒక్కసారి అంటూ ప్రజలందరిని మభ్య పెట్టి అధికారంలోకి వచ్చాక చుక్కలు చూపుతున్నారని విమ ర్శించారు. ఓటీసీయస్‌ పేరుతో ప్రజలనుంచి డబ్బులు వసూలు చేసే పని పట్టారని, ఏ ఒక్కరూ వాటిని కట్టవద్దని, టీడీపీ వచ్చిన వెంటనే  లబ్ధిదారులందరికి ఉచితంగా రిజిస్ర్టేషన్లు చేయిస్తామని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో  అమరావతినే రాజధానికిగా కొనసాగించాలని, రాజోలి ఆన కట్ట, కుందూ లిప్ట్‌ ఇరిగేషన్‌, స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణం పనులు చేపట్టాలని, ఓటీయస్‌ను రద్దు చేయాలని తీర్మానించినట్లు  లింగారెడ్డి  పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో  కడప ఇన్‌చార్జ్‌ అమీర్‌ బాబు, మైదుకూరు ఇన్‌చార్జ్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ జమ్మలమడుగు ఇన్‌చార్జ్‌  భూపేశ్‌రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-20T04:49:01+05:30 IST